https://oktelugu.com/

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఒక రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా..?

ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకైతే ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మక్కల్ సెల్వన్ గా తనదైన రీతిలో మంచి విజయాలను అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం చాలా బిజీయేస్ట్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 23, 2024 / 01:35 PM IST

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మొదట హీరోగా తన కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన మొదటి సినిమా మంచి వరుస విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేస్తూనే అవకాశం వచ్చిన ప్రతిసారి హీరోగా కూడా చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన డేట్స్ కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇక భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను చేసి మంచి విజయాలను సాధిస్తున్నారు.

    ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకైతే ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మక్కల్ సెల్వన్ గా తనదైన రీతిలో మంచి విజయాలను అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం చాలా బిజీయేస్ట్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన ఒక్క రోజుకి 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే ఆయన ఎంత పెద్ద నటుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ సినిమా ఏదైనా కూడా తన హావభావాలతో ఆ సినిమాకి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక మొత్తానికైతే విజయ్ సేతుపతి హవా ఇప్పుడు దేశం మొత్తం నడుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తెలుగులో ఆయన చేసిన ‘ఉప్పెన ‘ సినిమాలో ఆయన పోషించిన రాయనం పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక దాంతో ఆయన తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు ఇక ‘విక్రమ్ ‘ సినిమాతో పాన్ ఇండియాలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి నటుడికి రోజుకు 15 లక్షలు ఇవ్వడం పెద్ద ప్రాబ్లం అయితే కాదు.

    అని సిని విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఆయన సినిమాలో ఉన్నాడు అంటే మాత్రం బిజినెస్ భారీ రేంజ్ లో జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. అందువల్ల ఆయన అంత మొత్తంలో చార్జ్ చేయడంలో తప్పులేదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి…