https://oktelugu.com/

Rajinikanth: ఆ ఒక్క విషయం లో నేను చిరంజీవిని బీట్ చేయలేను అంటున్న రజినీకాంత్…

ఒకప్పుడు ప్రేక్షకులు వీళ్ళ సినిమాలను చూడడానికి విపరీతంగా ఇష్టపడుతుండేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ డాన్సులు వేయకపోయిన కూడా తన స్టైల్ తో ప్రేక్షకులను మైమరపింపజేసేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 23, 2024 / 11:37 AM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి రజనీకాంతులను మించిన హీరోలు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తెలుగు నుంచి చిరంజీవి ఎంతటి పాపులారిటిని సంపాదించుకున్నాడో, తమిళ్ నుంచి రజినీకాంత్ కూడా అంతే క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో వీళ్లను మించిన నటులుగాని వీళ్ళను మించిన స్టార్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోలు గాని ఎవరూ లేరు.

    ఒకప్పుడు ప్రేక్షకులు వీళ్ళ సినిమాలను చూడడానికి విపరీతంగా ఇష్టపడుతుండేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ డాన్సులు వేయకపోయిన కూడా తన స్టైల్ తో ప్రేక్షకులను మైమరపింపజేసేవారు. అలాగే చిరంజీవి డ్యాన్సులు వేస్తూ, యాక్టింగ్ చేస్తూ, భారీ ఫైట్స్ చేస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ‘ఘరానా మొగుడు’ సినిమా తర్వాత చిరంజీవి సౌత్ లోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పుడు బాలీవుడ్ లోని ఒక మ్యాగజైన్ ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అంటూ చిరంజీవి గురించి రాయడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.

    ఇక ఇదే టైంలో రజనీకాంత్ కూడా నేను చిరంజీవి లా డాన్సులు చేయలేను ఆ ఒక్క విషయంలో ఆయన్ని నేనెప్పుడూ బీట్ చేయలేను అంటూ ఆయన పలు సందర్భల్లో తెలియజేయడం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ చిరంజీవి రజనీకాంత్ ఇద్దరు కూడా బయట మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. కాబట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ కి అనుగుణంగానే పలు సందర్భాల్లో ఆయన చిరంజీవిని పొగడటం అనేది మనం చూస్తూ వచ్చాము…ఇక ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ఇప్పటికి కూడా వాళ్ళ సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాధించడంలో ముందుకు దూసుకెళ్తున్నారు.

    ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వరుస సినిమాలను చేస్తున్నారు…ఇక మొత్తానికైతే ఇప్పుటికి కూడా వీళ్ళు చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ప్రయత్నం చేస్తున్నారు…