Balakrishna: బాలకృష్ణ ను అభిమానించే తెలుగు హీరోలు వీళ్లే…

ప్రస్తుతం బాలయ్య, బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక దానికి విపరీతమైన ఆదరణ వస్తుంది.

Written By: Gopi, Updated On : June 23, 2024 11:06 am

Balakrishna

Follow us on

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు కి చాలా మంచి మాస్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక మొదటి నుంచి కూడా ఆయన మాస్ సినిమాలు చేయడమే దానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన హీరోలందరూ క్లాస్ మాస్ అన్ని సినిమాలు చేసుకుంటూ వస్తుంటే బాలయ్య బాబు మాత్రం మొదటి నుంచి కూడా మాస్ సినిమాలతో పాటు వైవిధ్యభరితమైన సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు కూడా ఆయన ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక దానికి విపరీతమైన ఆదరణ వస్తుంది. అలాగే ఈ సినిమాతో బాలయ్య మరొక భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ హీరోలకి బాలయ్య అంటే చాలా ఇష్టమట.

ఇక ఆయన అభిమానులుగా ఉండి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా నాగశౌర్య, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఉండడం విశేషం.. ఇక వీళ్ళకి మిగితా హీరోలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ బాలయ్య బాబు మీద కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ తో పాటు ఈయన సినిమాలను చూడడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారంట. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ల చిన్నప్పుడు బాలయ్య బాబు చేసిన మాస్ సినిమాలు వీళ్ళు థియేటర్ల ల్లో చూసినపుడు విజిల్స్ కూడా వేసేవారట.

ఇక బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కి అరిచి థియేటర్ మొత్తం సందడి సందడి చేసేవారట. ఇక ఇలాంటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఇప్పటికి కూడా మాస్ సినిమాలు చేస్తుండటం విశేషం…ఇక సినిమాలతో పాటు ‘అన్ స్టాపబుల్’ లాంటి షో లు చేయడం తో ప్రస్తుతం బాలయ్య బాబు క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.