Kalki 2898 AD: కల్కి 2898 ఏడి లో కల్కి ఎవరో తెలిసిపోయింది..? భైరవ కి తనకి సంబంధం ఏంటి..?

గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చి ఆరు నెలలు అవుతుంది.

Written By: Gopi, Updated On : June 23, 2024 11:02 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఇప్పటికే ప్రభాస్ అభిమానులైతే ఆయనను స్క్రీన్ మీద చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చి ఆరు నెలలు అవుతుంది. కాబట్టి మరోసారి ప్రభాస్ ని చూసి సందడి చేయడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకొవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర పోషిస్తుంటే కల్కి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం మీద చాలా రోజుల నుంచి చర్చలైతే జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ వేరు కల్కి పాత్ర వేరుగాఉంటుంది అంటూ చాలా మంది చెబుతున్నారు. ఇక కల్కి గా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు అంటూ మరి కొందరు భావిస్తున్నారు. కానీ అందరికీ షాకిస్తు కల్కి పాత్రలో కూడా ప్రభాసే కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి భైరవకి కల్కి కి మధ్య సంబంధం ఏంటి అసలు భైరవ కల్కితో ఎందుకు కలవాల్సి వస్తుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?

అనే పలు రకాల ప్రశ్నలతో ఈ సినిమా మీద చాలా సందేహాలు అయితే ఉన్నాయి. మరి వాటి అన్నింటికీ సమాధానం ఇస్తూ ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన ఖాతాలో భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…