https://oktelugu.com/

Tollywood Celebrities: రెండో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీ లు వీళ్లే…

సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ కూడా మొదట డైరెక్టర్ ఎ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది... కొద్దిరోజుల పాటు సక్రమంగా సాగిన వీళ్ళ జీవితం ఆ తర్వాత ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల విడాకులు తీసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 29, 2024 / 12:17 PM IST

    Tollywood Celebrities

    Follow us on

    Tollywood Celebrities: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలలో చాలామంది మొదట ప్రేమించి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత వచ్చిన కొన్ని విభేదాల కారణంగా విడిపోతూ మళ్లీ రెండో పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరికొందరైతే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరి రెండో పెళ్లి చేసుకుంటూన్నారు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా సిద్దు, అదితి రావు లు కూడా రెండో పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ మాత్రమే చేసుకున్నారు పెళ్లికి ఇంకా సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ తర్వాత వాళ్లే క్లారిటీ ఇచ్చారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ తమ్ముడైన ఆర్భాజ్ ఖాన్ మొదట మలైకా అరోరా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్ల మధ్య కొన్ని విభేదాలు రావడంతో అర్బజ్ ఖాన్ తనకి డీవోర్స్ ఇచ్చి, ప్రస్తుతం శౌరా ను పెళ్లి చేసుకున్నాడు…

    సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ కూడా మొదట డైరెక్టర్ ఎ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది… కొద్దిరోజుల పాటు సక్రమంగా సాగిన వీళ్ళ జీవితం ఆ తర్వాత ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల విడాకులు తీసుకున్నారు. అమలాపాల్ తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన జగత్ దేశాయ్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ గా ఉంది…

    అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో గా కొనసాగిన మంచు మనోజ్ కూడా తమ మొదటి భార్య కి విడాకులు ఇచ్చి భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…

    ఇక మంచు మనోజ్ కాకుండా వాళ్ళ ఫాదర్ అయిన మోహన్ బాబు కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య ఆయన విద్యా దేవి అనారోగ్యం కారణంగా మరణించడం తో ఆమె చెల్లెలు అయిన నిర్మలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదటి భార్య అయిన విద్య దేవికి విష్ణు, మంచు లక్ష్మి జన్మించారు. ఇక ఆ తర్వాత నిర్మల దేవికి మంచు మనోజ్ జన్మించాడు…

    విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు హీరోగా కొనసాగాడు. అయినప్పటికీ ఆయన సినిమా లైఫ్ అంత సాఫీగా అయితే సాగలేదు. ప్రస్తుతానికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. నరేష్ తన మొదటి ముగ్గురు భార్యలకు కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న పవిత్ర లోకేష్ ని నాల్గోవ పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…