IPL 2024: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఇక ఇప్పటికే ప్రతి టీమ్ తమ తమ ప్లేయర్లతో వాళ్ల మ్యాచ్ ను గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక దానికోసమే ఒక్కొ టీమ్ ఒక్కోరకమైన వ్యూహాలను రచిస్తూ ముందుకు కదులుతుంటే వాళ్ళ ప్లేయర్లు కూడా టీం కోసం తుది శ్వాస వరకు పోరాడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత 16 సీజన్లలో ఒక్కో ప్లేయర్ ఒక్కోరకంగా మ్యాచ్ కోసం తీవ్రమైన కసరత్తులు చేసి బాగా బ్యాటింగ్ చేస్తూ ఆరేంజ్ క్యాప్ ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు కదిలారు.
ఇక దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇప్పుడు కూడా ప్లేయర్లు మంచి ఫామ్ ను కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇండియన్ ప్లేయర్లు సైతం వీటిలో ముందు వరుసలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికే కోహ్లీ, గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పటివరకు వీళ్ళు ఆడిన ఒకటి రెండు మ్యాచ్ ల్లో ఎక్కువ స్కోర్ చేసిన, చేయకపోయిన ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ ల్లో వీళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.. ఇక ప్రస్తుతం హైదరాబాద్ టీం తరఫున ఆడుతున్న క్లాసేన్ అద్భుతమైన ప్రదర్శనను కనబరచడమే కాకుండా, ప్రస్తుతం టీమ్ విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.
రెండు మ్యాచ్ ల్లో ఆడిన క్లాసన్ 143 రన్స్ తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఆయన ఆడిన రెండు మ్యాచ్ ల్లో కూడా తన సత్తా చాటి హైదరాబాద్ తరపున తన పోరాట పటిమను చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు. ఇక రాజస్థాన్ ప్లేయర్ అయిన రీయాన్ పరాగ్ రెండు మ్యాచ్ ల్లో 127 పరుగులు చేసి టాప్ టు లో నిలిచాడు.. కోహ్లీ రెండు మ్యాచ్ ల్లో 98 పరుగులు చేసి థర్డ్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో వీళ్ళు మొదటి మూడు ప్లేస్ లను కైవసం చేసుకోగా,మొత్తం ఈ సీజన్ ముగిసే సమయానికి మన ఇండియన్ ప్లేయర్లైన గైక్వాడ్, గిల్ , యశస్వి జైశ్వాల్ లాంటి ప్లేయర్లు ముందు వరుసలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
గత సీజన్ లో శుభ్ మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను అందుకోగా, ఈసారి కూడా ఆయనే ఆ క్యాప్ ని గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన గుజరాత్ టీమ్ తరుపున కెప్టెన్ గా అదనపు బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికీ, గిల్ బ్యాట్ తో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ కూడా చెప్పుకోవచ్చు…