https://oktelugu.com/

Ram Charan Buchibabu: రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా మీద ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు..కారణం ఏంటి..?

నటన పరంగా కూడా ఆయన చాలా విమర్శలను అయితే ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ధృవ, రంగస్థలం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాకుండా రంగస్థలం సినిమాను ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిపాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.

Written By: , Updated On : May 15, 2024 / 05:13 PM IST
Ram Charan Buchibabu

Ram Charan Buchibabu

Follow us on

Ram Charan Buchibabu: చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక రెండో సినిమా అయిన మగధీర తో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన హీరోగా కూడా చరణ్ ఒక అదిరిపోయే రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయినప్పటికీ ఆయన రేంజ్ లో అయితే సక్సెస్ సాధించలేకపోయాయి.

ఇక నటన పరంగా కూడా ఆయన చాలా విమర్శలను అయితే ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ధృవ, రంగస్థలం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాకుండా రంగస్థలం సినిమాను ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిపాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా గురించి రామ్ చరణ్ స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటి కూడా బయటికి రావడం లేదు. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే ఫైనల్ అయ్యారు.

ఇక మిగతా ఆర్టిస్టులు గాని సినిమా షూటింగ్ గానీ ఎప్పుడు ఉంటుంది అనే అప్డేట్స్ కానీ ఏవి కూడా ఇంకా బయటికి రాకపోవడంతో ఈ సినిమా అప్డేట్స్ ఏంటి అని రామ్ చరణ్ అభిమానులు బుచ్చిబాబు ను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ మొత్తం ముగిస్తే గాని రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు అయితే లేవు…