Inaya Sultana: బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. అమ్మడు ఒంటిపై దుస్తులు లేకుండా కెమెరా ముందుకు వచ్చి షాక్ ఇచ్చింది. ఇనయ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. నటి ఇనయ సుల్తానాకు బిగ్ బాస్ షో ఫేమ్ తెచ్చిపెట్టింది. 2022లో ప్రసారమైన సీజన్ 6లో ఇనయ సుల్తానా కంటెస్ట్ చేసింది. ఇనయ సుల్తానా హౌస్లో బోల్డ్ గేమ్ ఆడింది. ఆమె ఎఫైర్ నడిపింది. కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే ఇష్టమని ఓపెన్ గా చెప్పింది.
ఇక హౌస్లో వీరిద్దరి రొమాన్స్ హైలెట్ అయ్యింది. ఒక దశలో ఇనయ సుల్తానా గేమ్ కూడా ఆపేసి సూర్య ప్రేమలో మునిగిపోయింది. హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో సెట్ అయ్యింది. విడిపోయినట్లు నటిద్దామని ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్యను ఇనయ నామినేట్ చేసింది. ఆ వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. సూర్య ఎలిమినేషన్ ని ఇనయ తట్టుకోలేకపోయింది. గట్టిగా ఏడ్చేసింది.
సూర్య హౌస్ నుండి వెళ్ళిపోయాక ఇనయ సుల్తానా గేమ్ ఆడింది. హౌస్ లో రెబల్ లేడీగా పేరు తెచ్చుకుంది. ఇనయ సుల్తానా టైటిల్ ఫేవరేట్ గా కూడా ప్రచారం అయ్యింది. అనూహ్యంగా 14వ వారం ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్నమాట వినిపించింది. సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇక సీజన్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్ అవతరించాడు. శ్రీహాన్ రన్నర్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు.
హౌస్ నుండి బయటకు వచ్చాక ఇనాయ సుల్తానా కెరీర్ గతంలో కంటే ఊపందుకుంది. తెలుగు ఆడియన్స్ ఆమెను ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఫ్రైడే టైటిల్ తో ఇనయ సుల్తానా ఓ చిత్రం చేస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఇనయ సుల్తానా హాట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటో షూట్ చేసింది. ఇనయ సుల్తానా తెగింపుకు జనాలు అవాక్కు అవుతున్నారు. కుర్రాళ్ళు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.