https://oktelugu.com/

Summer Movies: ‘తెర’మరుగు.. సమ్మర్ లో సినిమాలకు నో ఛాన్స్

గతంలో ఏదైనా కొత్త సినిమా విడుదల అయిందంటే దానిపై చర్చ జరిగేది. సినిమాపై పెద్ద ఎత్తున టాక్ నడిచేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయం మీద ఎక్కువ చర్చ నడుస్తుండగా.. విద్యార్థులు, యువత మాత్రం ఐపీఎల్ మ్యాచులపై ఎక్కువగా మాట్లాడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 16, 2024 9:23 am
    Summer Movies

    Summer Movies

    Follow us on

    Summer Movies: ఎంటర్టైన్మెంట్ లో సినిమాది అగ్రస్థానం. కానీ సినిమాల గురించి ఇప్పుడు చర్చ జరగడం లేదు. అసలు ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందో? పక్కకు వెళుతోందో తెలియని పరిస్థితి. ఇప్పుడంతా ఐపీఎల్ హవా నడుస్తోంది. మరోవైపు రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమా ‘తెర’మరుగవుతోంది. ఓవైపు ఐపీఎల్, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సినిమా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఈ సమ్మర్ లో థియేటర్లలో ప్రేక్షకులు కనిపించడం లేదు. అంతెందుకు సరైన సినిమాలు కూడా పడడం లేదు. అందుకే ఈ వేసవిలో సినిమా జోష్ లేనట్టే.

    గతంలో ఏదైనా కొత్త సినిమా విడుదల అయిందంటే దానిపై చర్చ జరిగేది. సినిమాపై పెద్ద ఎత్తున టాక్ నడిచేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయం మీద ఎక్కువ చర్చ నడుస్తుండగా.. విద్యార్థులు, యువత మాత్రం ఐపీఎల్ మ్యాచులపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. నడి వేసవిలో కాస్తా ఉపశమనం పొందుతామని థియేటర్లకు ఎక్కువ మంది వెళ్లేవారు. కానీ ఈ సమ్మర్లో సరైన సినిమా కూడా విడుదల కాలేదు. కేవలం ఎన్నికల కోణంలోనే సినిమాల విడుదలకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీనికి తోడు ఐపీఎల్ మ్యాచ్లు ఉర్రూతలూగిస్తున్నాయి. యువత ఆ మ్యాచ్లపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్, వైరల్ అంశాల్లో క్రికెట్ దే సింహ భాగంగా నిలుస్తోంది.

    ఏపీలో మాత్రం పొలిటికల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది. దేశంలో ఏపీ రాజకీయాలు వేరన్నట్టు.. ఇక్కడ ప్రతి వారం రోజులకు ఒక హాట్ టాపిక్ తెరపైకి వస్తోంది. గత నాలుగు రోజులుగా రాళ్లదాడి పైనే చర్చ కొనసాగుతోంది. ఏ ఇద్దరు కలిసినా అదే మాట వినిపిస్తోంది. సానుభూతి కోసం తనకు తాను చేయించుకున్నారని ఒకరు.. కాదు కాదు అది ప్రత్యర్థుల చేసే పని అని మరొకరు.. ఇలా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు. అంతవరకు రాజకీయ అంశాలకి ప్రాధాన్యం దక్కనుంది. సినిమాలకు చోటు ఉండదని భావించి నిర్మాతలు వేసవిలో విడుదలకు ఛాన్స్ ఇవ్వలేదు. సమ్మర్ తర్వాతనే తమ చిత్రాల విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో సినిమా ధియేటర్లు బేల చూపులు చూస్తున్నాయి.