https://oktelugu.com/

Hyundai Car: మార్కెట్లో రిలీజ్ అయిన అదిరిపోయే లో-బడ్జెట్ కారు .. ధర ఎంతో తెలుసా?

గ్రాండ్ ఐ 10 పాత మోడల్ ను పోలినప్పటికీ కొన్ని స్పెషిఫికేషన్స్ మార్చారు. కొత్త మోడల్ లో కార్పొరేట్ ఎడిషన్ గ్రే సేడ్ తో డ్యూయెల్ టోన్ ట్రీట్ మెంట్ తో మార్కెట్లోకి వచ్చింది. హ్యాచ్ బ్యాక్ లో డ్రైవర్ సీటులో మార్పులు చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2024 / 09:19 AM IST

    Hyundai grandi i 10 nios

    Follow us on

    Hyundai Car:  నేటి కాలంలో చాలా మంది 4 వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో లో బడ్జెట్ లో వచ్చే కారు కోసం వెతుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు లో బడ్జెట్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ లేటేస్ట్ ఫీచర్స్ ను జోడించి, తక్కువ ధరకు కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే గ్రాండ్ ఐ 10. ఈ మోడల్ ఇదివరకే పరిచయం అయినప్పటికీ గ్రాండ్ ఐ 10 నియోస్ కొత్త వేరియంట్ ను ఇటీవల విడుదల చేసింది. ఈ కారు ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో చూద్దాం..

    గ్రాండ్ ఐ 10 పాత మోడల్ ను పోలినప్పటికీ కొన్ని స్పెషిఫికేషన్స్ మార్చారు. కొత్త మోడల్ లో కార్పొరేట్ ఎడిషన్ గ్రే సేడ్ తో డ్యూయెల్ టోన్ ట్రీట్ మెంట్ తో మార్కెట్లోకి వచ్చింది. హ్యాచ్ బ్యాక్ లో డ్రైవర్ సీటులో మార్పులు చేశారు. ఫ్రంట్ రూమ్ ల్యాంప్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ ప్యాకెట్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేతో కూడిన 8.89 సెంటిమీటర్ల స్పీడో మీటర్ 17.14 సెంటి మీటర్ల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ వంటివి ఉన్నాయి. మ్యూజిక్ కోసం బ్లూటూత్ కంట్రోల్స్ 4 స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి.

    ఈ మోడల్ ఇంజిన్ విషయానికొస్తే 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 82 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తూ 114 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను రిలీజ్ చేయనుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి గ్రాండ్ ఐ 10 నియోస్ సీఎన్ జీ వేరియంట్ లో కూడా లభ్యమవుతోంది. సేప్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ లు ఉన్నాయి.

    ఈ కారు ధర తక్కువగానే కేటాయించారు. కార్పొరేట్ ఎడిసన్ గా పిలవబడుతున్న ఇది రూ.6.93 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.58 లక్షల వరకు ఉంది. కార్పొరేట్ ఎడిషన్ మాగ్నా ట్రిమ్, స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రిమ్ తో పోలిస్తే ఈ కారు కొన్ని అప్డేట్ లను పొందింది. అధునాతన సౌకర్యాలు కలిగిన ఈ మోడల్ గురించి తెలిసిన వెంటనే వినియోగాదారులు ఇంప్రెస్ అవుతున్నారు.