Tollywood: వీరి కాంబినేషన్ అసలు హిట్ కాలేదు.. ఇంతకీ వారెవరంటే

కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి టాలీవుడ్ హీరో రామ్ తో ‘ది వారియర్’ అనే సినిమాను తెరకెక్కించారు. రామ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ నో యూజ్.

Written By: Swathi Chilukuri, Updated On : July 5, 2024 11:42 am

Tollywood

Follow us on

Tollywood: ప్రాంతీయ సినిమాలు మాత్రమే చేయాలి అనుకోవడం లేదు హీరోలు దర్శకనిర్మాతలు. అందుకే దర్శకులు పక్క రాష్ట్రాల హీరోలతో, హీరోలు పక్క రాష్ట్రాల దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇలా చేసి ఫ్లాప్ లను కూడా మూటగట్టుకున్నారు కొందరు. ఇంతకీ వారు ఎవరో చూసేయండి.

శైలేష్ కొలను

తెలుగులో మంచి పేరు సంపాదించిన శైలేష్ కొలను బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ తో ‘హిట్’ సినిమాను రిమేక్ చేశారు.. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఎస్ జె సూర్య: పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాతో జతకట్టారు ఎస్ జె సూర్య. కానీ కొమరం పులి సినిమాతో ప్రేక్షకులను బాగా నిరాశపరిచారు.

లింగుస్వామి

కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి టాలీవుడ్ హీరో రామ్ తో ‘ది వారియర్’ అనే సినిమాను తెరకెక్కించారు. రామ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ నో యూజ్.

పుష్కర్ గాయత్రి

ఈ తమిళ డైరెక్టర్ ‘విక్రమ్ వేద’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను హిందీలో తెరకెక్కించారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లతో ఈ సినిమాను రీమేక్ చేసి.. ఫ్లాప్ లను మూటగట్టుకున్నారు.

తిరు
తమిళ దర్శకుడు తిరు గోపీచంద్ తో ‘చాణక్య’ అనే సినిమాను తెరకెక్కించి డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకున్నారు.

గౌతమ్ తిన్ననూరి
టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశారు. ఈ మూవీ ప్లాప్ అక్కడ ఫ్లాప్ ను మూటగటగట్టుకుంది.

ఏ ఆర్ మురుగదాస్

మహేష్ బాబుతో ఏఆర్ మురుగదాస్ స్పైడర్ సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.

గౌతమ్ వాసుదేవ్ మీనన్

నాగ చైతన్య తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ , నానితో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ వంటి సినిమాలను తెరకెక్కించారు గౌతమ్ వాసుదేవ్ మీనన్. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.