Site icon OkTelugu

Arya Movie: ఆర్య సినిమా కోసం సుకుమార్ కి టెస్ట్ పెట్టిన అల్లు అర్జున్…అది ఏంటంటే..?

Allu Arjun gave a test to Sukumar for Arya movie

Allu Arjun gave a test to Sukumar for Arya movie

Arya Movie: అల్లు అర్జున్ కెరియర్ లో ఆర్య సినిమా అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన గంగోత్రి సినిమా సక్సెస్ అయింది. కానీ ఆయనకు కెరియర్ పరంగా ఎలాంటి క్రేజ్ ను ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయంలో ఆర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.

ఇక ఆర్య సినిమా వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ ఇప్పుడున్న సమయంలో డైరెక్టర్ లకి అవకాశాలు ఇవ్వడానికి చాలామంది ప్రొడ్యూసర్ ఉన్నారు. కానీ అప్పట్లో ఒక డైరెక్టర్ కి అవకాశం రావాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. నిజానికి దిల్ రాజు లాంటి ఒక ప్రొడ్యూసర్ నాతో సినిమా తీయడం అనేది నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి.

ఎందుకంటే అప్పటివరకు నేను ఒక సినిమాను కూడా డైరెక్ట్ చేయలేదు. తను కూడా తీసింది ఒకటే సినిమా అయినప్పటికీ తను నాపైన చాలా నమ్మకం ఉంచి నాతో ఈ సినిమా చేయించారని చెప్పాడు. ఇక అప్పట్లో సినిమాలను రీల్స్ లో మేము షూట్ చేసేవాళ్లం వీలైనంత వరకు తక్కువ రీల్స్ ని వాడడానికి ఎక్కువ ప్రయత్నం చేసేవాళ్ళం…కానీ అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు రీల్స్ వేస్ట్ అయిపోయినప్పుడు దిల్ రాజు కోపం తో నా దగ్గరికి వచ్చి నా వెనకాల నుంచి నా చేతిని మలిచి నా వీపు మీద దబిదబిమని రెండుసార్లు గుద్దేవాడు ఇప్పుడు దానివల్లే నేను సరిగ్గా పుషప్స్ కూడా చేయలేకపోతున్నాను అంటూ ఆ సంఘటనను ఫన్నీ గా చెబుతూనే సుకుమార్ ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

నిజానికి దిల్ రాజు సుకుమార్ కి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. దానివల్లే ఆర్య సినిమా అనేది అంత బాగా వచ్చింది. ఇక మొత్తానికైతే సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

Exit mobile version