https://oktelugu.com/

Tollywood Heroine: పదేళ్లలో ఒక్క హీరోకి కూడా లిప్ కిస్ ఇవ్వని హీరోయిన్… సాయి పల్లవి కాదు, ఎవరో తెలుసా?

యి పల్లవితో పాటు మరొక హీరోయిన్ కూడా ఇంత వరకు లిప్ లాక్ సీన్ చేయకపోవడం విశేషం. ఆమె ఎవరో కాదు.. కీర్తి సురేష్. ఒకప్పటి హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 4, 2024 / 09:36 AM IST

    Tollywood Heroine

    Follow us on

    Tollywood Heroine: లిప్ లాక్ సీన్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ దీన్ని పెద్ద సాహసంగా చూస్తారు. సౌత్ ఆడియన్స్ అయితే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన హీరోయిన్ కి బోల్డ్ ఇమేజ్ అంటగడతారు. బాలీవుడ్ లో చాలా కాలం క్రితమే లిప్ లాక్ సన్నివేశాలు కామన్ అయ్యాయి. సౌత్ లో కూడా పలువురు హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ చేశారు. అయితే సాయి పల్లవి ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. చెప్పాలంటే మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో సాయి పల్లవి నటించలేదు.

    సాయి పల్లవితో పాటు మరొక హీరోయిన్ కూడా ఇంత వరకు లిప్ లాక్ సీన్ చేయకపోవడం విశేషం. ఆమె ఎవరో కాదు.. కీర్తి సురేష్. ఒకప్పటి హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 2013లో విడుదలైన మలయాళ చిత్రం గీతాంజలి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం నేను శైలజ. 2016లో విడుదలైన నేను శైలజ హిట్ టాక్ తెచ్చుకుంది. నానికి జంటగా నేను లోకల్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది.

    Tollywood Heroine

    పవన్ కళ్యాణ్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ అజ్ఞాతవాసి మాత్రం నిరాశపరిచింది. మహానటి మూవీతో కీర్తి సురేష్ ఫేమ్ ఎల్లలు దాటింది. ఆ సినిమాలో నటనకు కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. కీర్తి సురేష్ లుక్ రీత్యా ఆమెకు హోమ్లీ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. గ్లామరస్ హీరోయిన్ గా ఆమెను ఎవరూ గుర్తించలేదు. మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం మోడ్రన్ గా ఆమె పాత్ర ఉంటుంది. ఆ చిత్రంలో కూడా కీర్తి సురేష్ గ్లామర్ షో చేసింది లేదు.

    కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్ కి ఒప్పుకోదట. గతంలో అలాంటి సన్నివేశం ఉందని నితిన్ మూవీ రిజెక్ట్ చేసిందట. అనంతరం వీరి కాంబోలో రంగ్ దే విడుదలైంది. ఆ చిత్రంలో కూడా కీర్తి సురేష్ పక్కా హోమ్లీ రోల్ చేసింది. ఈ మధ్య కీర్తి సురేష్ తన ఫోకస్ బాలీవుడ్ మీద పెట్టింది. వరుణ్ ధావన్ కి జంటగా ఓ చిత్రం చేస్తుంది. ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. నిజానికి కీర్తి సురేష్ ఆలోచనా ధోరణి మారింది. ఆమె గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోరుకుంటుంది. ఇంస్టాగ్రామ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్కిన్ షో చేస్తుంది. మరి చూడాలి వరుణ్ ధావన్ మూవీలో కీర్తి రోల్ ఎలా ఉంటుందో…