Amala Akkineni: హీరో నాగ చైతన్యతో స్టెప్ మదర్ అమలకు ఎలాంటి అనుబంధం ఉందనేది ఎవరికీ తెలియదు. వీరిద్దరు పెద్దగా కలిసి కనిపించిన దాఖలు కూడా ఉండవు. అయితే ఓ సందర్భంలో నాగ చైతన్యని ఉద్దేశిస్తూ అమల కీలక కామెంట్స్ చేసింది. హీరో నాగార్జునకు రెండు వివాహాలు. చదువు పూర్తి చేసుకుని విదేశాల నుండి వచ్చిన నాగార్జునను దగ్గుబాటి రామానాయుడు అల్లుడిని చేసుకున్నాడు. తన కుమార్తె లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశాడు. నాలుగేళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అప్పటికే నాగ చైతన్య పుట్టాడు.
అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న లక్ష్మి అక్కడే సెటిల్ అయ్యింది. ఇక నాగార్జున తనతో కలిసి నటించిన హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1992లో నాగార్జున-అమల పెళ్లి పీటలు ఎక్కారు. వారికి అఖిల్ సంతానం. అటు తాత రామానాయుడు సైడ్ నుండి కూడా నాగ చైతన్యకు భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ నాగ చైతన్యను నాగార్జున స్వయంగా లాంచ్ చేశాడు.
నాగార్జున వారసుడిగానే నాగ చైతన్య వెండితెరకు పరిచయం అయ్యాడు. 2015లో రెండో కుమారుడు అఖిల్ ని కూడా నాగార్జున సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. స్టెప్ మదర్, స్టెప్ బ్రదర్ తో నాగ చైతన్యకు ఎలాంటి అనుబంధం ఉంది? వాళ్ళు బాగా కలిసిపోతారా? లేక ఎడమొహం పెడమొహంగా ఉంటారా? అనే సందేహాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు అమల గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.
అమల మాట్లాడుతూ… నాగ చైతన్య తన తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ లోని నాగార్జున దగ్గరకు వచ్చేవాడు. ఎక్కువగా నాన్నతో గడిపేవాడు. నాగ చైతన్యను నేను పెంచలేదు. అయితే చాలా మంచి కుర్రాడు. చాలా కామ్ గా ఉండేవాడు. అఖిల్ అలా కాదు, హైపర్ యాక్టీవ్ గా ఉండేవాడు. నాగ చైతన్య వస్తే అఖిల్ తనని వదిలేవాడు కాదు. నాగ చైతన్య ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురు చూసేవాడు. అఖిల్ కి నాగ చైతన్య ఒక మంచి బ్రదర్, అని అన్నారు. ఆమె మాటలను బట్టి చూస్తే నాగ చైతన్యతో అమల, అఖిల్ కి మంచి అనుబంధం ఉంది..