Kalki Pre Release Event: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ సెంట్రఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎందుకంటే ఆయన గత కొద్దిరోజుల నుంచి అసలు బయట ఎక్కడ కనిపించడం లేదు. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ చాలా హ్యాండ్సం గా కనిపించడమే కాకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు.
మరి ఈ సినిమా ఈవెంట్ లో ప్రెగ్నెంట్ గా ఉన్న దీపిక పదుకొనే కూడా పాల్గొనడం విశేషం. ఇక దీపికా స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత మెట్లు దిగేటప్పుడు తను ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి ఇబ్బంది పడుతుందనే ఉద్దేశ్యం తోనే ప్రభాస్ ఆమెకు చేయి అందించి తనను పట్టుకొని నిదానంగా ఆమెను మెట్లు దించాడు. ఇక ఇది చూసిన ప్రభాస్ అభిమానులు మా అన్న ప్రభాస్ అంటే ఇలా ఉంటుంది. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడంలో ఎవరైనా ప్రభాస్ తర్వాతే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ కి లేడీస్ అంటే చాలా గౌరవం..
ఆయన ఎప్పుడు కూడా లేడీస్ విషయంలో గానీ ఇతర విషయాల్లో గాని కాంట్రవర్సీలో ఇరుక్కున్న సందర్భాలలో లేవు. వాళ్ల పెదనాన్న కృష్ణం రాజు పెపకం లో పెరిగాడు కాబట్టి ప్రభాస్ లేడీస్ ని చాలా గౌరవిస్తూ ఉంటాడు. ఇక దీపికా పదుకొనే కి హెల్ప్ చేసిన సిచ్ వేశన్ ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రను పోషిస్తుంటే కమలహాసన్ మాత్రం కలి పాత్రను పోషిస్తున్నాడు.
ఇక కలి అంటే విలన్ పాత్ర అనే విషయం మనకు తెలిసిందే. అయితే కమలహాసన్ ప్రభాస్ ని ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఈ సినిమాలో కామెడీ చేస్తూనే యాక్షన్ ని కూడా పండిస్తారట…