https://oktelugu.com/

Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇక కలవరా..? కొనసాగుతున్న కోల్డ్ వార్, ఇదిగో ప్రూఫ్! అసలు ఎక్కడ చెడింది?

మౌనిక-మనోజ్ వివాహం చేసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. అవి నిజం చేస్తూ మనోజ్ పెళ్లి ప్రకటన చేశాడు. 2023 మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు విష్ణు హాజరు కాలేదు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో వెళ్ళాడు. నూతన వధూవరులను ఆశీర్వదించాడు. మౌనికను వివాహం చేసుకోవడం విష్ణు, మోహన్ బాబుకు ఇష్టం లేదని ఇండస్ట్రీ టాక్.

Written By:
  • S Reddy
  • , Updated On : July 9, 2024 11:26 am
    Manchu Brothers

    Manchu Brothers

    Follow us on

    Manchu Brothers: మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఇకపై మంచు విష్ణు, మనోజ్ కలవరా? అనే సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే… అన్నదమ్ముల మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు ఉంది. విషయంలోకి వెళితే… గత రెండేళ్లుగా మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్- విష్ణు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన ఉంది. మనోజ్ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన కొన్నాళ్ళు హైదరాబాద్ లో లేడు. సడన్ గా భూమా మౌనికతో కనిపించి షాక్ ఇచ్చాడు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం వద్ద మనోజ్-మౌనిక పూజలు జరిపారు.

    దాంతో మౌనిక-మనోజ్ వివాహం చేసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. అవి నిజం చేస్తూ మనోజ్ పెళ్లి ప్రకటన చేశాడు. 2023 మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు విష్ణు హాజరు కాలేదు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో వెళ్ళాడు. నూతన వధూవరులను ఆశీర్వదించాడు. మౌనికను వివాహం చేసుకోవడం విష్ణు, మోహన్ బాబుకు ఇష్టం లేదని ఇండస్ట్రీ టాక్.

    పెళ్లి జరిగిన కొద్దిరోజులకు మనోజ్ సోషల్ మీడియా స్టేటస్ లో షేర్ చేసిన వీడియో సంచలనం రేపింది. విష్ణు తనపై తన మనుషులపై దాడి చేస్తున్నాడని ఇదిగో ప్రూఫ్ అంటూ మనోజ్ ఆ వీడియోలో చెప్పాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. మంచు బ్రదర్స్ మధ్య విభేదాలపై పూర్తి స్పష్టత వచ్చింది. ఆ వీడియో ఫ్రాంక్ అని మనోజ్ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు తాజాగా మనోజ్ తన కూతురు బారసాల వేడుక నిర్వహించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

    కూతురికి దేవసేన శోభ అని పేరు పెట్టాడు. సోషల్ మీడియా సందేశంలో మంచు లక్ష్మితో పాటు పేరెంట్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన మంచు మనోజ్.. విష్ణు పేరు పొందుపరచలేదు. అలాగే చైల్డ్ అబ్యూస్ ని వ్యతిరేకిస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ కి స్పందించిన మంచు విష్ణు… తమ్ముడు వేసిన అదే తరహా ట్వీట్ పై మౌనం వహించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పట్లో వీరు కలిసే అవకాశం లేదంటున్నారు.