Rohit Sharma: తల్లి పై ఇంత ఆగ్రహమా?.. రోహిత్ పై మండిపడుతున్న నెటిజన్లు

టి20 వరల్డ్ కప్ సాధించడం ద్వారా టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో టీమిండియా ఆటగాళ్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తో కాసేపు మాట్లాడారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు ముంబై బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. అనంతరం వాంఖడె స్టేడియంలో జరిగిన అభినందన సభలో బిసిసిఐ ఆధ్వర్యంలో సన్మానం పొందారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 9, 2024 11:33 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ధోని ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో రోహిత్ నాయకత్వ పటిమ పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ దశ నుంచి మొదలుపెడితే ఫైనల్ దాకా ఓటమనేది లేకుండా టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. సౌత్ ఆఫ్రికా తో ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 17 సంవత్సరాల తర్వాత టీమిండియా ఖాతాలో మరో టి20 వరల్డ్ కప్ చేరింది.

టి20 వరల్డ్ కప్ సాధించడం ద్వారా టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో టీమిండియా ఆటగాళ్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తో కాసేపు మాట్లాడారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు ముంబై బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. అనంతరం వాంఖడె స్టేడియంలో జరిగిన అభినందన సభలో బిసిసిఐ ఆధ్వర్యంలో సన్మానం పొందారు.. ఇదే క్రమంలో 125 కోట్ల చెక్కును బీసీసీఐ క్రికెటర్లకు అందించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ మాతృమూర్తి పూర్ణిమ కూడా టీమిండియా సంబరాలలో భాగమయ్యారు. టి20 వరల్డ్ కప్ సాధించిన కుమారుడిని చూసి ఆమె ఆనందానికి గురయ్యారు. తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. ఈ సమయంలో రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరు విమర్శలకు కారణమవుతోంది. తల్లి ప్రేమను పరిగణలోకి తీసుకోకుండా.. అక్కడి నుంచి నిష్క్రమించేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం తెలుస్తోంది. దీంతో కొంతమంది రోహిత్ శర్మను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. “టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భార్య భుజంపై చేతులు వేసి సరదాగా మాట్లాడావు. అదే భార్య విషయానికి వచ్చేసరికి తేడాగా ప్రవర్తిస్తున్నావ్. భార్యతో ఉన్న అనుబంధం తల్లితో లేదా? ఇదేనా నీ నాయకత్వ పటిమ” అంటూ నెటిజన్లు రోహిత్ శర్మ ప్రశ్నిస్తున్నారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అయితే రోహిత్ శర్మ అలాంటివాడు కాదని, తన తల్లికి గౌరవం ఇస్తాడని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. “వాస్తవానికి రోహిత్ శర్మ తల్లి చేసిన దాంట్లో తప్పేమీ లేదు.. ఆమె తన ప్రేమను కొడుకు పై వ్యక్తపరిచారు. కాకపోతే భారీగా జనం ఉన్నారు కాబట్టి రోహిత్.. ఇంటికెళ్లాక చూసుకుందామని ఆమెకు చెప్పాడు. అదే సమయంలో ఇంటికి వెళ్లిన తర్వాత రోహిత్ తన తల్లితో ప్రేమగా ఉన్నాడు. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు సాకుగా చూపి రోహిత్ పై విమర్శలు చేయొద్దని” ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.