Uma Shankari: కొంతమంది నటీనటులు ఎంత బాగా నటించినా పెద్దగా గుర్తింపు రాదు. మంచి సూపర్ హిట్ చిత్రాల్లోనే వీళ్ళు నటించి ఉంటారు, కానీ ఎందుకో వాళ్లకు సినిమా అవకాశాలు మాత్రం రావు. అలాంటి వారిలో ఒకరు ఉమా శంకరి. ఈమె పేరు మీకెవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు , కానీ చూడగానే గుర్తు పెట్టగలరు. ఎందుకంటే ఆమె అలాంటి సూపర్ హిట్ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి. పూర్తి వివరాల్లోకి వెళ్తే , విక్టరీ వెంకటేష్ , వీవీ వినాయక్ కాంబినేషన్ లో అప్పట్లో తెరకెక్కిన ‘లక్ష్మి’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్ ఆడియన్స్ , ఫ్యామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా ఆరోజుల్లో రికార్డుల వర్షం కురిపించింది ఈ చిత్రం. ఇందులో వెంకటేష్ కి పెద్ద చెల్లిగా నటించింది ఉమా శంకరి.
విలన్స్ తో చేతులు కలిపి , తన అన్నయ్య ని అవమానించాలని చూసిన తమ్ముళ్లకు గడ్డి పెట్టే సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఫ్యాక్టరీ లో తన అన్నయ్యని నాలుగు గోడల మధ్య అవమానించినందుకు బయటకు తీసుకొచ్చి చెప్పు తీసుకొని విలన్స్ ని కొడుతోంది ఈమె. ఈ సన్నివేశాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఐకానిక్ సన్నివేశం ఇది. అలాంటి సినిమాలో నటించిన ఈమెకు తెలుగు లో అవకాశాలు రాలేదు. అంతకు ముందు ఈమె తెలుగు లో అమ్మోబొమ్మ , కల్యాణ రాముడు, నవ్వుతూ బ్రతకాలిరా వంటి సినిమాల్లో నటించింది. ఆమె కెరీర్ అత్యధిక శాతం కోలీవుడ్ లోనే సాగింది. కానీ హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అన్ని క్యారెక్టర్ రోల్స్ అవ్వడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని సమాచారం.
ఈమె గతకొంత కాలం నుండి రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతోంది. ప్రస్తుతం ఈమె హాస్పిటల్ లో కీమో థెరఫీ , ఇమ్మ్యూనో థెరఫీ చేయించుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ ని చూసిన నెటిజెన్స్ తీవ్రమైన దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 2007 వ సంవత్సరం వరకు ఈమె యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈమె ‘భాగ్యలక్ష్మి ‘ అనే తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ రీ ఎంట్రీ పెద్దగా కలిసి రాలేదు. ఈమె చివరి సారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘వలిమై’. ఇందులో తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ హీరో గా నటించారు. ఈమెకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని మీకోసం కింద షేర్ చేస్టున్నాము చూడండి.
