https://oktelugu.com/

Surya Family: సూర్య ఫ్యామిలీని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..

ప్రస్తుతం సూర్య ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూర్య, జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి దియా, దేవ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 6, 2024 / 09:34 AM IST

    Surya Family

    Follow us on

    Surya Family: తమిళ నటుడు అయినా సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు సూర్య. గజిని సినిమాతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా చేసుకున్నారు. తెలుగులో ఇదే సినిమా ఆయనకు బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందించింది. ఆ తర్వాత నుంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నాడు. ఈయన లేటెస్ట్ గా కంగువా అనే భారీ ప్యాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక రీసెంట్ గా సూర్య తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు

    ప్రస్తుతం సూర్య ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూర్య, జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి దియా, దేవ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వీరి వివాహం 11 సెప్టెంబర్ 2006 లో ఘనంగా జరిగింది. సూర్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే జ్యోతిక పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. చాలా రేర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే కంగువా సినిమాతో మరోసారి రాబోతున్నారు.

    ఈ సినిమా టీజర్ విడుదలై వావ్ అనిపించడమే కాదు ఊహకందని విజువల్ ఎఫెక్స్ట్, ఫస్ట్ గ్లింప్స్ అబ్బురపరిచాయి. ఇది బింబిసారకు దగ్గరగా ఉంటుందని టాక్. ఇక గ్లింప్స్ ప్రకారం అయితే సీన్స్ వందల సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశాలు అని తెలుస్తోంది. ఇప్పటితి తో పాటు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను లింక్ చేసి కంగువాలా చూపిస్తారని తెలుస్తోంది. ఇక ఇందులో హీరో గత కాలంలో ఓ భయంకరమైన క్రూరమైన రాజు. ప్రస్తుతం కాలంలో వచ్చిన ఈ రాజు ఎలా ఉంటాడు అనేది కథ అని తెలుస్తోంది.

    ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు చేయాలనే కారణంతో సూర్యకు దర్శకుడు బాలాకు భేదాబిప్రాయాలు వచ్చాయట. దీంతో సున్నితంగా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఓ ప్రకటన వచ్చింది. సూర్యకు ఈ కథ సూట్ కాదని మరో హీరోతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని.. దర్శకుడు ప్రకటించారు. కానీ మొత్తం మీద మళ్లీ ఇందులో సూర్యనే రానున్నారు. మరి ఈ సినిమా సూర్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.