https://oktelugu.com/

KGF Villain: కేజీఎఫ్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆ నటుడిని ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా..?

సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తూ కే జి ఎఫ్ లాంటి ఒక భారీ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అవ్వడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా పాన్ ఇండియా లో భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 6, 2024 / 09:55 AM IST

    KGF Villain

    Follow us on

    KGF Villain: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న కేజిఎఫ్ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. అప్పట్లో కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే ఇండియాలో అసలు ఏ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్లని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ నాసిరకమైన కథలతో సినిమాలు వస్తాయి. అలాగే అది పెద్ద ఇండస్ట్రీ కూడా కాదు అందువల్లే ఎవరు ఆ సినిమాలను పట్టించుకునే వారు కాదు.

    కానీ సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తూ కే జి ఎఫ్ లాంటి ఒక భారీ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అవ్వడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా పాన్ ఇండియా లో భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది.
    అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ ఈ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడంతో ఆయన కూడా పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కోసం చాలా కష్టపడ్డాడట. ఇక ఈ సినిమాలో కేజీఫ్ గోల్డ్ మాఫియా అధినేత ఆయిన సూర్య వర్ధన్ పెద్దకొడుకుగా గరుడ పాత్రలో నటించే నటుడి కోసం ప్రశాంత్ నీల్ చాలా సంవత్సరాల పాటు తిరిగాడట.

    ఆయన కూడా తనకి ఆ పాత్రలో నటించే సరైన నటుడు దొరకకపోవడంతో ఒకరోజు ఆ పాత్రకు సంబంధించిన ఆడిషన్స్ చేస్తున్నప్పుడు యశ్ బాడీ గార్డ్ గా ఉన్న రామ్ ను చూసి తనని ఆడిషన్ చేశాడట..
    అలాగే యశ్ బాడీ కి తగ్గట్టుగా తన బాడీని బిల్డ్ చేయమని చెప్పడంతో అతను తన బాడీని ఫిట్ గా చేశాడు. తన డెడికేషన్ ను చూసిన ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ మొదటి పార్ట్ లో గరుడ అనే మెయిన్ విలన్ పాత్రను పోషించే అవకాశం అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో తను ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ పలు సినిమాల్లో అవకాశాలు అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా చాలా బిజీగా మారిపోయాడు…