Sudigali Sudheer daughter: బుల్లితెర పై సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ , యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈయన, సినిమాల్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే, మరోపక్క టీవీ షోస్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న షోస్ లలో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న షో ‘ఆట’. జీ తెలుగు ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ డ్యాన్స్ షో కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇందులో డ్యాన్స్ వేస్తున్న కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఉన్నారు. ఎవరు ది బెస్ట్ అని చెప్పడం కష్టమలాగా ఉంది పరిస్థితి .
ఇదంతా పక్కన పెడితే డ్రామా జూనియర్స్ లో బాగా పాపులర్ అయిన చిన్నారులతో ప్రతీ ఎపిసోడ్ లోనూ ఒక స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని ఇప్పిస్తున్నారు. కేవలం డ్రామా జూనియర్స్ లో చేసిన చిన్నారులను మాత్రమే కాకుండా, షోలో పాల్గొనే వాళ్లకు సంబంధించిన పిల్లలు ఉన్నా, వాళ్ళతో కూడా ప్రతీ ఎపిసోడ్ లోనూ ఒక స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇప్పిస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ ఒక చిన్నారి తో ఆడుకుంటూ స్టేజి మీద కనిపించడం చూసేందుకు చాలా ముచ్చటగా అనిపించింది. ఆ పాప మరెవరో కాదు , సుధీర్ తమ్ముడి కూతురు పావని అట. ఈమెను ఈ షో ద్వారా ఆడియన్స్ కి పరిచయం చేశాడు. అంతే కాకుండా ఈ చిన్నారి ఇచ్చిన స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. సుధీర్ ఈమెని తన సొంత కూతురు లాగా చూసుకుంటాడట. మా ఇంటి అదృష్ట దేవత అంటూ సుధీర్ ఈమె గురించి చాలా గొప్పగా ఈ ఎపిసోడ్ లో మాట్లాడాడు.
ఈ షో కి జడ్జిగా , నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక కొణిదెల సుడిగాలి సుధీర్ కి స్వీట్ సర్ప్రైజ్ గా ఈ చిన్నారిని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో ని చూసిన తర్వాత నెటిజెన్స్ నీకెప్పుడు పెళ్లి జరుగుతుంది అంటూ సుధీర్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. పెళ్లి చేసుకొని ఉండుంటే నీకు కూడా ఇప్పుడు అంతకంటే పెద్ద కూతురు ఉండేది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.