Chiranjeevi: చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబో లో ఒక పొలిటికల్ కథ రెడీ చేసిన స్టార్ రైటర్…

రీసెంట్ గా పిఠాపురం నియోజక వర్గం లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది తన ఫాలోయింగ్ ఏంటో మరోసారి చూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములను బేస్ చేసుకొని యండమూరి వీరేంద్రనాథ్ ఒక పొలిటికల్ డ్రామా స్టోరీని రాశారట.

Written By: Gopi, Updated On : June 10, 2024 9:22 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా వచ్చి హీరోగా సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఒకప్పుడు చిరంజీవి మాత్రం సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎవ్వరి సపోర్టు తీసుకోకుండా సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారి అటు తర్వాత సుప్రీం హీరోగా అవతరించాడు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ గా పేరు సంపాదించుకొని ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగాడు.

ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నప్పటికీ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలనైతే అందుకుంటూ వచ్చాయి. ఇక వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లను అందుకున్న ఏకైక హీరో గా కూడా చిరంజీవి పేరు సంపాదించుకోవడం విశేషం…ఇక ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడి గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇమేజ్ తార స్థాయిలో ఉందనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా పిఠాపురం నియోజక వర్గం లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది తన ఫాలోయింగ్ ఏంటో మరోసారి చూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములను బేస్ చేసుకొని యండమూరి వీరేంద్రనాథ్ ఒక పొలిటికల్ డ్రామా స్టోరీని రాశారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు నటిస్తే బాగుంటుందని యండమూరి భావించి ఇప్పటికే ఆ కథను చిరంజీవికి కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచాడు. కాబట్టి తన మీద చాలా బాధ్యత అయితే ఉంది. మరి ఆ బాధ్యత నిర్వర్తిస్తూ పొలిటికల్ కి సంబంధించిన సినిమాలు చేసి మెప్పిస్తే మాత్రం ఆయన ఇప్పటికి కూడా అటు సినిమాల్లో రానిస్తూనే ఇటు పొలిటికల్ గా కూడా తన సత్తా చూపిస్తున్నా వాడవుతాడు. మరి ఈ సినిమాను చేయడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒప్పుకుంటారా లేదా అనే అనుమానలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళు కనక ఈ సినిమా చేసినట్టైతే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…