Rave Party: రేవ్ పార్టీ కేసులో ఎంటరైన ఏపీ నేతలు!

కొద్ది రోజుల కిందట బెంగళూరులోని ఓ రిసార్ట్లో రేవ్ పార్టీపై పోలీసుల దాడి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది వరకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో తెలుగు నటి హేమ తో పాటు మరో 20 మంది వరకు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Written By: Dharma, Updated On : May 28, 2024 9:45 am

Rave Party

Follow us on

Rave Party: తెలుగు నటి హేమను కాపాడే ప్రయత్నం జరుగుతోందా? ఏపీ నేతలు ఎంటర్ అయ్యారా? విచారణ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కన్నడ మీడియా సైతం ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. దీంతో హేమను కాపాడుతున్న ఆ ఏపీ లీడర్లు ఎవరు? ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దాని వెనుక ఉన్న కారణాలేంటి? అన్నదానిపై బలమైన చర్చ నడుస్తోంది. కచ్చితంగా తెరవెనుక ఏదో జరిగిందన్నది.. అందరిలో ఉన్న అనుమానం. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

కొద్ది రోజుల కిందట బెంగళూరులోని ఓ రిసార్ట్లో రేవ్ పార్టీపై పోలీసుల దాడి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది వరకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో తెలుగు నటి హేమ తో పాటు మరో 20 మంది వరకు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే తాను హైదరాబాదులోనే ఉన్నట్లు హేమ ఒక వీడియోను విడుదల చేశారు. నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె రేవ్ పార్టీలోనే పట్టుబడినట్లు.. డ్రగ్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈనెల 27న ఆమెకు విచారణ కోసం బెంగళూరు పోలీసులు పిలిచారు. ప్రత్యేకంగా నోటీసులు ఇచ్చారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నట్లు.. విచారణ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరారు. అయితే ఇంతలోఏపీ నాయకులు ఎంటర్ అయినట్లు సమాచారం. హేమను విచారణకు పిలిచి.. అంతటితో వదిలేయాలని విచారణ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి స్టిక్కర్ తో కూడిన కారు పట్టుబడింది. అనంతపురం జిల్లాకు చెందిన విప్ అనుచరుడు నిర్వహకుల్లో ఒకరని ప్రచారం జరుగుతోంది.

కన్నడ మీడియాలో ఈ డ్రగ్స్ కలకలం సృష్టించింది. రేవ్ పార్టీయే ప్రాధాన్యత అంశంగా మారింది. ప్రధానంగా ఆంధ్రా మూలాలపైనే అక్కడ పోలీసులు ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నేతల నుంచి ఫోన్లు వెళ్లడంతో అక్కడ అధికారులు ఒక ప్రాథమిక నిర్ణయానికి వస్తున్నారు. ముఖ్యంగా నటి హేమ వెనుక ఉన్నది ఎవరు? పట్టుబడిన తర్వాత కూడా ఆమె హైదరాబాదులో ఉన్నట్టు ఎందుకు చెప్పారు? అలా ఎవరు చెప్పించారు? ఇప్పుడు ఆమెను తప్పించేందుకు ఎందుకు రంగంలోకి దిగారు? అన్న బలమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అందరి పేర్లు ఏపీలో అధికార పార్టీ నేతల వైపే చూపిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నీరు గారకూడదని.. మరోసారి రేవ్ పార్టీలు అనే సంస్కృతి ఉండకూడదని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ కేసు మరింత బిగిసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.