Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకున్న అభిమానులు కూడా అంతే స్థాయిలో ఉంటారు. ఆయన సినిమా వస్తుందంటే ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఆయన సినిమాల ఎంపికలో కూడా ఎంతో వైవిధ్యం చూపిస్తారు. విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో ఆయన శైలి ఓ ప్రత్యేకమే. ఆయనకున్న స్టార్ డమ్ దృష్ట్యా ఆయన చిత్రాల ఎంపికలో కూడా ఎంతో శ్రద్ధ కనబరుస్తారని ప్రచారం ఉంది.

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే పవన్ కల్యాణ్ తన హావభావాలతోనే ఆకట్టుకుంటారు. చిత్రాలు, పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటారు. మూస పాత్రల ధోరణికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకమే. వెరైటీకి పెద్దపీట వేస్తారు. సినిమాకు సినిమాకు వైవిధ్యం చూపించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
పవన్ కల్యాణ్ చిత్రాల ఎంపికలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పాత్ర ఉంటుందనేది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో తీసిన చిత్రాల్లో ఆయన పాత్రకు ప్రత్యేకత చూపించడం తెలిసిందే. పవన్ తో తాను తీసిన చిత్రాల్లో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ ను వైవిధ్యంగా చూపించి చిత్ర విజయానికి దోహదపడ్డారు. ఆయనకు పవన్ పై ఉన్న అభిమానం అలాంటిది మరి.
ఇక పవన్ కల్యాణ్ రాబోయే చిత్రం భీమ్లా నాయక్. ఇందులో పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ ఓ పాట రాశారు. ఆ పాటలో పవన్ కల్యాణ్ ను శ్రీకృష్ణుడితో పోలుస్తూ వర్ణించాడు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతోనే త్రివిక్రమ్ పాటలో పవన్ కల్యాణ్ స్థాయిని మరింత పెంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Raghava Lawrence: జై భీమ్ సినిమా నిజ జీవిత పాత్ర “పార్వతమ్మ” కు… ఇల్లు కట్టిస్తా అన్న రాఘవ లారెన్స్
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇందుకోసమే పాటలో పవన్ కల్యాణ్ ను కృష్ణుడితో పోలుస్తూ పాట రాశారని ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ దాదాపు అందరు హీరోలతో సినిమాలు తీసినా పవన్ కల్యాణ్ తో మాత్రం వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన పాట ఏ మేరకు ప్రేక్షకులను కట్టిపడేయనుందో వేచి చూడాల్సిందే.
Also Read: Vijay Setupathi: విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి రివార్డు ప్రకటన!