Ram Pothineni Birthday: దేవ దాస్ నుంచి డబుల్ ఇస్మార్ట్ గా మారిన రామ్ కి బర్త్ డే విషెష్….

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నింటిని ఇన్ క్లూడ్ చేస్తూ పూరి జగన్నాథ్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 15, 2024 10:13 am

Ram Pothineni Birthday

Follow us on

Ram Pothineni Birthday: దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ పోతినేని.. తను చేసిన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ఈయన ఆ తర్వాత వరుసగా రెఢీ, కందిరీగ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఈ నటుడు ముందు లవ్ స్టోరీస్ చేసి మంచి సక్సెస్ లు అందుకున్న తర్వాత మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తను మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నా రామ్ ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఇక ఈరోజుతో 36 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రామ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం తను అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని తను సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నింటిని ఇన్ క్లూడ్ చేస్తూ పూరి జగన్నాథ్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు రామ్ చాలా ఎనర్జిటిక్ గా నటిస్తూ చాలామంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు.

ఇక అలాగే చాలా చిన్న ఏజ్ లో హీరోగా మారిన రామ్ ప్రస్తుతం టైర్ టు హీరోల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగడం విశేషం.. ఇక ఇప్పుడు ఈయన స్టార్ హీరోగా మారడానికి కసరత్తులు చేస్తున్నాడు. మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సక్సెస్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు…