https://oktelugu.com/

Suchi Leaks: మరలా తెరపైకి సుచి లీక్స్… ధనుష్, ఐశ్వర్యల చీకటి జీవితం ఇదా?

ధనుష్, ఐశ్వర్యలు ఇతరులతో అఫైర్స్ సాగించారని ఆమె పరోక్షంగా అన్నారు. కాగా ధనుష్, ఐశ్యర్య విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2022లో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 15, 2024 / 10:08 AM IST

    Suchi Leaks

    Follow us on

    Suchi Leaks: సింగర్ సుచిత్ర కోలీవుడ్ లో అతి పెద్ద వివాదానికి తెరలేపారు. 2017 లో సుచి లీక్స్ పేరుతో టాప్ స్టార్స్ ప్రైవేట్ ఫోటోలు తెరపైకి వచ్చాయి. రానా, త్రిష, ఆండ్రియా జెర్మియా, ధనుష్, అనిరుధ్ రవి చంద్రన్ ల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. సింగర్ సుచిత్ర అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇవి ప్రత్యక్షం అయ్యాయి. ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ ఉలిక్కి పడ్డాయి. ఈ క్రమంలో సింగర్ సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదని కథనాలు వెలువడ్డాయి.

    ఆ ఘటన జరిగి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. తాజాగా మరోసారి సుచిత్ర సంచలన కామెంట్స్ చేసింది. ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ల వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు ఆమె. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ని కూడా ఆమె వదల్లేదు. ధనుష్, జీవీ ప్రకాష్ లను ఆమె గే లు అని ఆరోపించారు. ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ తమ రిలేషన్ లో నిజాయితీగా లేరని సుచిత్ర అన్నారు. ఒకరిని మరొకరు మోసం చేసుకున్నారని సుచిత్ర వెల్లడించారు.

    ధనుష్, ఐశ్వర్యలు ఇతరులతో అఫైర్స్ సాగించారని ఆమె పరోక్షంగా అన్నారు. కాగా ధనుష్, ఐశ్యర్య విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2022లో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పుడప్పుడు వీరు కలిసి కనిపించడం విశేషం. సింగర్ సుచిత్ర తాజా కామెంట్స్ ప్రకారం… ఎఫైర్స్ కారణంగానే వారు విడిపోయారని తెలుస్తుంది. మరి సుచిత్ర కామెంట్స్ తో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

    సుచీ లీక్స్ అనంతరం సింగర్ సుచిత్ర కెరీర్ నెమ్మదించింది. సుచిత్ర బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో పాల్గొన్నారు. హౌస్లో ఆమె పెద్దగా రాణించింది లేదు. 49 రోజులు హౌస్లో ఉన్న సుచిత్ర 7వ వారం ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో సైతం సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. పలువురు సెలెబ్స్ మీద ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. కోలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా సుచిత్ర పేరు తెచ్చుకుంది.