Pawan Kalyan: రేపటి నుంచి పవన్ వారాహి దీక్ష

పవన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే పట్టడం, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో సినీ పరిశ్రమ ఆనందిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలంత నిన్న డిప్యూటీ సీఎం పవర్ ను కలిశారు.

Written By: Dharma, Updated On : June 25, 2024 11:09 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతతో బిజీగా ఉన్నారు. వరుసగా సమీక్షలు, సమావేశాలు, ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. అటు సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా బిజీగా ఉన్న పవన్ ఈనెల 26 నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్షలో ఆయన కొనసాగునున్నారు. దీక్షలు ఉన్నన్ని రోజులు పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. 2023 జూన్ లో పవన్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి వారాహి అని పేరు పెట్టారు. నాడు యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తాజాగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి అమ్మవారి దీక్షకు దిగనున్నారు పవన్.

పవన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే పట్టడం, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో సినీ పరిశ్రమ ఆనందిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలంత నిన్న డిప్యూటీ సీఎం పవర్ ను కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం సినీ నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించడానికి తామంతా హైదరాబాదు నుండి వచ్చామని వారు గుర్తు చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని కోరామని.. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో చిత్ర పరిశ్రమకు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కార మార్గం చూపేందుకు పవన్ ముందుకు వచ్చారు. చిత్ర పరిశ్రమ సమస్యలను ఒక నివేదిక రూపంలో తయారు చేసుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ పరిశ్రమ పెద్దలను సమావేశపరచి కొన్నింటికి పరిష్కార మార్గం చూపించనున్నారు.

రేపటి నుంచి వారాహి దీక్షలో పవన్ గడపనున్నారు. ప్రస్తుతం పవన్ వద్ద నాలుగు శాఖలు ఉన్నాయి. దీంతో క్షణం తీరిక లేకుండా పవన్ గడుపుతున్నారు. అటు దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దీక్ష పూర్తి చేయనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. నిన్ననే క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు పవన్. అటు ఖాళీ సమయంలో క్యాంప్ కార్యాలయం వద్దనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. రేపటి నుంచి పవన్ దీక్ష ఉండడంతో.. రోజువారి షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.