Samantha- Naga Chaitanya: తొలిప్రేమ జ్ఞాపకాలు చాలా ప్రత్యేకం. ఎన్నాళ్లయినా అవి వెంటాడుతూనే ఉంటాయి. హీరో నాగ చైతన్య ఇండస్ట్రీకి వస్తూనే ప్రేమలో పడ్డాడు. ఆయన రెండో చిత్రం ఏమాయ చేశావే తో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అలాగే ఫస్ట్ లవ్ లో కూడా పడ్డాడు. సమంత చార్మ్, బ్యూటీ, క్యూట్ నెస్ కి పడిపోయాడు. అందులోనూ ఓ రేంజ్ లో రొమాన్స్ చేశాడు. లిప్ కిస్సులు, హగ్గులతో రెచ్చిపోయాడు. వాటి తాలూకు ఫీలింగ్స్ నేరుగా నాగ చైతన్య గుండెల్లోకి వెళ్లిపోయాయి. అదే సమయంలో నాగ చైతన్య హ్యాండ్సమ్నెస్ కి సమంత కూడా ప్లాట్ అయ్యారు. ఇక వీరి రహస్య ప్రేమాయాణం ఏళ్ల తరబడి సాగింది.

2018లో పెళ్లి చేసుకుంటారనగా కొద్ది నెలల ముందు బయటకు పొక్కింది. నాలుగేళ్లు కలిసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవించిన ఈ బ్యూటిఫుల్ కపుల్ విడిపోయారు. భార్యాభర్తలుగా కంటే ప్రేమికులుగా ఎక్కువ కాలం కలిసున్న వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సమంత-నాగ చైతన్య విడాకులు అందరికీ బిగ్ షాక్ అని చెప్పాలి. ఈ న్యూస్ డైజెస్ట్ చేసుకోవడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది. మరలా వారు కలిసిపోతే బాగుంటుందని కోరుకున్నారు. పెద్ద వివాదమే చోటు చేసుకున్న నేపథ్యంలో సన్నిహితులు, పేరెంట్స్ నచ్చజెప్పినా వినలేదు.
అయితే భౌతికంగా విడిపోయినా మానసికంగా ఇంకా కలిసున్నారేమో అనిపిస్తుంది. సమంత గతంలో నాగ చైతన్యతో కాపురం చేసిన ఇంట్లోనే ఉంటుంది. నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచలో ఉన్న సుమంత-చైతూ వారు ఉంటున్న ఫ్లాట్ అమ్మేశారు.అయితే కొత్త ఇంట్లోకి వెళ్లకుండానే విడిపోయారు. ఇక అమ్మేసిన ఇంటిని సమంత తిరిగి కొనుక్కుంది. అక్కడే ఉంటుంది. నాగ చైతన్య కూడా సమంత జ్ఞాపకాలతో సావాసం చేస్తున్నారట. అప్పట్లో సమంత పెంచిన మొక్కల పట్ల ప్రేమగా ఉంటున్నాడట. వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నాడట.

సమంత ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఇష్టపడేవారు. దీని కోసం ఆమె ఇంట్లో అనేక పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచేవారు. విడిపోయాక సమంత వాటిని వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య వాటికి నీళ్లు పోస్తున్నాడట. ఆ విధంగా సమంత వదిలి వెళ్లిన మొక్కలపై ప్రేమ కురిపిస్తున్నాడట. మరో వైపు నాగ చైతన్య పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన రెండో పెళ్ళికి సిద్దమయ్యారంటున్నారు. సమంత విషయంలో కూడా అదే తరహా కథనాలు వెలువడుతున్నాయి.
[…] Also Read: Samantha- Naga Chaitanya: సమంత అంటే చైతూకి అంత ప్రేమా… […]