ఎవరు మీలో కోటీశ్వరులు, యూట్యూబ్ లో సమంతా: జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం సంగతి తెలిసిందే. తమ ప్రతిభ ద్వారా సామాన్యులని కోటేశ్వరుని చేయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. కౌన్ బనేగా కరోడ్పతి అనే పేరుతో హిందీలో ఈ షో మాత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తద్వారా షో నిర్వాహకులు దీన్ని తదితర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అలా తెలుగులో ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు గా రూపుదిద్దుకున్నది.
అయితే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీస్ విచ్చేసారు. షో కర్టెన్ రైజర్ లో రామ్ చరణ్ హాజరు అయ్యి కార్యక్రమాన్నిపెద్ద హిట్ అయ్యే మార్గం దిశగా నడిపించారు. ఈ నేపథ్యం లో ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతి వారం వారం ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులుగా జెమినీ టీవిలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభం కాకముందు జెమినీ టీవీ రేటింగ్స్ చాలా దారుణం గా ఉండేవి. ఈ షో ప్రాంభమయ్యాక మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో పాటు దూసుకుపోతుంది. ప్రారంభమే సెలబ్రిటీ గెస్ట్ రాంచరణ్ తో మొదలవ్వగా అవ్వగా, దానికి గాను మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో లో సెలెబ్రిటీలు పాల్గునేటట్లు షో నిర్వాహకులు ప్లాన్ చేశారు.
అయితే కొద్దీ రోజుల క్రితం జెమినీ టీవీ ప్రసారాకులు తమ పంథాను మార్చారు. గేరు మార్చి గేమ్ ప్లాన్ చేంజ్ చేశారు. కొరటాల శివ, రాజమౌళి వచ్చిన మొత్తం ఎపిసోడ్ ని యూట్యూబ్ లో పెట్టగా… విడాకుల తర్వాత సమంత పాల్గున్న మొదటి టీవీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు. ఈ ఎపిసోడ్ ని దసరా సందర్భంగా టీవీ లో ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు సమంతా ఎపిసోడ్ మొత్తాన్ని ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు.