బిగ్ బాస్ ఎలిమినేషన్ లో సంచలనం, భారీ ట్విస్ట్: బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్ లాంటి గేమ్. ఎన్నో ఎత్తుగడలు వేస్తేనే నెగ్గుతారు. మరి ఇలాంటి గేమ్ లో అవసరమయిన చోట బుద్ది బలం తో పాటు బాహుబలం కూడా ప్రదర్శించాలి. అప్పుడే విజయ తీరాలకు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ లో శనివారం రానే వచ్చింది. ఇంకా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు రానే వచ్చింది. ఇంకో ఒక్కరోజు ఆగితే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఖచ్చితం గా తెలిసిపోతుంది.
పదో వారానికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. పదో వారానికి ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి గానూ రవి, సన్నీ, మానస్, కాజల్, సిరి నామినేట్ అయ్యారు. సామజిక మాధ్యమాల్లో, ఇతర అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే డేంజర్ జోన్ లో మానస్, కాజల్ లు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది పక్కా జరగబోతుంది.
భారీ ట్విస్ట్: అయితే, ప్రతిచోటా అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో కాజల్ లీస్ట్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టీ చూస్తే కాజల్ ఈవారం ఎలిమినేట్ అయిపోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బిగ్ బాస్ లో అనుకోని షాకింగ్ పరిణామం చోటుచేసుకున్నది. బిగ్ బాస్ కంటెస్టెంట్ జస్వంత్ పాదాల (జెస్సీ) గత రెండు వారాలుగా “వర్టిగో” (తల తిరగడం) అనే వ్యాధితో బాధ పడుతున్నాడు. జెస్సీ హెల్త్ కండిషన్ చాలా సివియర్ గా మారిపోవడం వల్ల సోమవారం జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్తాడు.
ఈ క్రమంలో నెమ్మదిగా ఆరోగ్యం కుదుట పడటం తో సీక్రెట్ రూమ్ కి వచ్చి క్వారంటైన్ లో ఉంటాడు జెస్సి. మళ్లి రోగం తిరగపెట్టడం తో మెడికల్ రూమ్ కి వెళ్తాడు. తాజా గా లీకైన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుండి జెస్సీ ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది అనే విషయం తెలియాలంటే రేపు (ఆదివారం) జరిగే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.