https://oktelugu.com/

Janhvi Kapoor: జాన్వీ కపూర్ మీద కామెంట్లు చేసిన స్టార్ యాక్టర్…ఫైనల్ గా ఏం జరిగింది..?

సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది సూపర్ సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొందరు మాత్రం వీలైనంత తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అవుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 05:52 PM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ ‘8 ఏ ఎం మెట్రో ‘ అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘గుల్షన్ దేవయ్య’… ఇక ఈ తరంలో ఉన్న నటుల్లో ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుల్లో గుల్షన్ ఒకరు. ఇక ఈయన ఎంత మంచి నటుడు అనే విషయం ఆయన సినిమాలు చూసిన చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి ఆయన జాన్వీకపూర్ తో ‘ఉలగ్’ అనే ఒక సినిమాలో నటించాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుల్షన్ మాట్లాడుతూ ఉలగ్ సినిమా షూటింగ్ సమయంలో జాన్వీ కపూర్ అసలు ఫ్రీ గా ఉండేది కాదని ఏదో అంటి ముట్టనట్టుగా ఉండేదని చెప్పాడు. అలాగే షాట్ రెడీ అన్నప్పుడు వచ్చి షూట్ చేసేదని ఆ తర్వాత వెళ్ళిపోయేదని తన మీద కొన్ని కామెంట్లైతే చేశాడు. ఇక దాంతో జాన్వీ మీద కామెంట్లు చేస్తున్న గుల్షన్ మీద జాన్వీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ చాలా విమర్శలను చేస్తున్నారు. ఇక దీంతో ఆయన మరోసారి ఈ వివాదం మీద వివరణ ఇవ్వాల్సిన అవసరమైతే వచ్చింది…నేను జాన్వీ కపూర్ మీద నెగిటివ్ కామెంట్లు చేయలేదు. షూటింగ్ అంటే అందులో నటించే నటీ నటుల మధ్య మంచి స్నేహపూర్వకమైన సంబంధం ఉంటే ఆన్ స్క్రీన్ మీద కూడా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతోనే నేను నటించే ప్రతి నటీనటులతో చాలా క్లోజ్ గా ఉండాలని అనుకుంటాను. అందువల్లే నా కో ఆర్టిస్టులతో ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటాను.

    Also Read: ప్రశాంత్ నీల్ ఆ స్టార్ హీరోతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడా..?

    కానీ జాన్వీ మాత్రం అంతగా మాట్లాడేది కాదు. ఓన్లీ షూట్ సమయంలో మాత్రమే సెట్ కు వచ్చేది… అలాంటి నటితో మనం ఆన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేస్తాము అనే ఉద్దేశ్యం తో నేను మాట్లాడాను అంతే తప్ప ఇందులో తప్పులు వెతకాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జాన్వీ మంచి నటి అందులో డౌటే లేదు. అయితే ఇంతకుముందు నేను నటించిన సినిమాల్లో హీరోయిన్స్ అందరూ నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ లాగా తమ విషయాలన్నిటినీ షేర్ చేసుకునే వాళ్ళు అలా చేస్తే అందరి మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.

    కానీ జాన్వీ లో అది లేదనే ఉద్దేశంతో నేను చెప్పాను అంతే… అయిన అందరూ ఒకేలా ఉండరు కదా.. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు అది వాళ్ళ నైజం మనకు నచ్చినట్టు ఉండమంటే ఎవరు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అంటూనే నేను ఆమెను కించపరిచే విధంగా అయితే ఏమీ మాట్లాడలేదు. ఆర్టిస్టుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉంటే స్క్రీన్ మీద సీన్ బాగా రావడానికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంలో మాట్లాడాను అంతే తప్ప వ్యక్తిగతంగా ఆమెను దూషించాలనే ఉద్దేశ్యం అయితే నాకు లేదు అంటూ తను ఒక వివరణ ఇచ్చాడు.

    ఇక ఇదంతా చూసిన సినీ పండితులు సైతం ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న గుల్షన్ ఇవన్నీ నీకు అవసరమా? నీ సినిమాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళాక వాళ్ల మీద వీళ్ళ మీద కామెంట్లు చేయడం ఎందుకు అంటూ గుల్షన్ మీద సీరియస్ అవుతున్నారు…ఇక మొత్తానికైతే జాన్వీ కపూర్ ఫ్యాన్స్ గుల్షన్ ను టార్గెట్ చేసి విమర్శలను చేస్తున్నారు…ఇక ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…