https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్లకు పుల్ స్టాప్ పెడుతున్న స్టార్ హీరోయిన్…

సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంటే అందులో లిప్ లాక్ సీన్లు ఉండే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే తను అలాంటి సీన్లకి ఒప్పుకోదు కాబట్టి ఈ సినిమాతో రౌడీ బాయ్ లిప్ లాక్ సీన్లకు సాయి పల్లవి కళ్లెం వెయ్యబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 8, 2024 / 08:45 AM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ భాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ..అయితే అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఆయన ఏ సినిమా తీసిన కూడా అందులో తప్పనిసరిగా లిప్ లాక్ లు అయితే ఉంటూ వస్తున్నాయి. ఇక అర్జున్ రెడ్డి సినిమా అయితే బోల్డ్ కంటెంట్ కాబట్టి ఆ సినిమాలో విపరీతమైన లిప్ లాక్ సీన్లు అయితే ఉంటాయి. ఇక దానికి తోడుగా ప్రతి సినిమాలో తన అభిమానులు అలాంటి సీన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో వాటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

    ఇక ఇప్పుడు ఆయన దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవి కిరణ్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మొత్తానికైతే దిల్ రాజు సాయి పల్లవి ని ఒప్పించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సాయి పల్లవి తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే సినిమా చేయదు. మరి ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్లు అయితే తప్పనిసరిగా ఉండేవి.

    కానీ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంటే అందులో లిప్ లాక్ సీన్లు ఉండే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే తను అలాంటి సీన్లకి ఒప్పుకోదు కాబట్టి ఈ సినిమాతో రౌడీ బాయ్ లిప్ లాక్ సీన్లకు సాయి పల్లవి కళ్లెం వెయ్యబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒక సినిమా చేయడానికి సాయి పల్లవి ని ఒప్పించాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని..ఎందుకంటే ఆమె పెట్టే కండిషన్స్ అన్నింటిని దర్శక నిర్మాతలు ఒప్పుకుంటే తప్ప ఆమె సినిమా చేయదు.

    కాబట్టి ఇలాంటి కండిషన్ లో కూడా తను ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే మాత్రం ఆమె పెట్టిన కండిషన్స్ కు అటు దిల్ రాజు, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సాయి పల్లవి మరొక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే తను చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో తనదైన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతుంది…