https://oktelugu.com/

Prasanth Varma: హనుమాన్ 2 .. ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాలో హనుమంతుడు శ్రీరాముడికి ఏం చెప్పాడనే కథతో రూపొందుతుందట. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని టాక్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 8, 2024 / 08:34 AM IST

    Prasanth Varma

    Follow us on

    Prasanth Varma: ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి పాన్-ఇండియా లెవల్ లో సెన్సేషన్ అయ్యాడు. తెలుగు డైరెక్టర్లలోనే ఈయన ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనే టాక్ సంపాదించాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు తెరకెక్కించే లెవల్ కు వెళ్లాడు ప్రశాంత్ వర్మ.

    ఇదంతా ఇలా ఉంటే ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాలో హనుమంతుడు శ్రీరాముడికి ఏం చెప్పాడనే కథతో రూపొందుతుందట. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని టాక్. శ్రీరామ నవమి సందర్భంగా జై హనుమాన్ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

    ఇక ఈ సినిమా కోసం దర్శకుడు ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించారు. ఈ ప్రకటన పోస్టర్ డిజైనర్ లకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. తన సినిమా కోసం పోస్టర్ డిజైనర్లను వెతుకుతున్నట్టు ట్వీట్ చేశారు ఈ డైరెక్టర్. ఇంట్రెస్ట్ ఉన్న వారు సంప్రదించాలి అంటూ చెప్పారు. అంతేకాదు ఏకంగా ఫుల్ టైం జాబ్ అని పోస్టులో మెన్షన్ చేసారు. మీలో పోస్టర్ డిజైన్ చేసే టాలెంట్ ఉంటే వెంటనే సంప్రదించండి. ఎందుకు ఆలస్యం. మొత్తం మీద ఈ ట్వీట్ తో గొప్ప మనసున్న వాడు ప్రశాంత్ వర్మ అంటూ కామెంట్లు సొంతం చేసుకున్నారు.