https://oktelugu.com/

Ramya Krishnan: వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న శివగామి… క్యారెక్టర్ ఏంటంటే..?

ఒకప్పుడు జంధ్యాల ఎలాంటి కామెడీ అయితే రాసేవారో ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అలాంటి జన్యూన్ కామెడీతో సినిమాలు చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 16, 2024 / 09:49 AM IST

    Ramya Krishnan

    Follow us on

    Ramya Krishnan: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కామెడీ సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను అందుకునే డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఒకప్పుడు జంధ్యాల ఎలాంటి కామెడీ అయితే రాసేవారో ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అలాంటి జన్యూన్ కామెడీతో సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ఏడు సినిమాల్లో 7 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ను అందుకోవడమే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.

    ఇక ఇప్పుడు ఆయన వెంకటేష్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా రమ్యకృష్ణ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి లాంటి సినిమాలో శివగామి పాత్రను పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

    ఇక ఆ తర్వాత కూడా అనే పలు సినిమాలో నటించినప్పటికీ అందులో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని ప్లాప్ లుగా మిగులుతున్నాయి. ఇక రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో ఆమె మహేష్ బాబు తల్లి పాత్రలో నటించి మెప్పించినప్పటికీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. కాబట్టి ఆమె క్రేజ్ అనేది కొద్దిగా తగ్గినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సినిమాలో మాత్రం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో తను కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ చేయడం లేదు కానీ రమ్యకృష్ణ పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు అనిల్ రావిపూడి రవితేజ, మహేష్ బాబు, వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఇక వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 లాంటి రెండు సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఈ సినిమాతో కూడా సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు.