https://oktelugu.com/

World War III: ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.. 48 గంటల్లో ప్రారంభం..!?

జూన్‌ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్‌ తెలిపారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 16, 2024 / 09:54 AM IST

    World War III

    Follow us on

    World War III: మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. మరో 48 గంటల్లో మొదలవుతుంది అని వెల్లడించారు న్యూ నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్‌కుమార్‌. జూన్‌ 18న మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నారు.

    ఇవి సంకేతాలట..
    మూడో ప్రపంచ యుద్ధానికి కుశాల్‌ కొన్ని సంకేతాలను వెల్లడించారు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిమద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్‌ లెబనాన్‌ మధ్య పెరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలని వెల్లడించారు.

    గ్రాహాల సంఘర్షణ..
    జూన్‌ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్‌ తెలిపారు. మే నెలలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన తర్వాత కుశాల్‌ ఈ అంచనా అందించారు. జూన్‌ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్‌ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.

    48 గంటలకు క్లిష్టమైనవి..
    కుశాల్‌ కుమార్‌ అంచనా ప్రకారం.. రాబోయే 48 గంటలు క్లిష్టమైనవని తెలిపారు. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని సృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందకి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారతాయని తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని వెల్లడించారు. ఈ యుద్ధం ప్రపంచాన్ని సర్వ నాశనం చేస్తుందని కుశాల్‌ వివరించారు.