Rajinikanth Coolie Actors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్లకు అనుగుణంగానే మన దర్శకులు సైతం గొప్ప సినిమాలు చేయడానికి తీవ్రమైన తీవ్రమైన కసరత్తులు చేస్తు మంచి సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు…తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సైతం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు రీసెంట్ గా రజినీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరోసారి తన ఖాతాలో సక్సెస్ ని వేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సినిమాలో కథ పెద్దగా ఇంప్రెస్సివ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద కొంతవరకు నెగెటివ్ ఒపీనియన్ ను చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కూలీ సినిమా కోసం మొదట కొంతమంది ఆర్టిస్టులను అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల వాళ్ళు ఆ సినిమా నుంచి తప్పుకోవడం, లేదంటే సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడం లాంటివి జరిగాయి. ఈ సినిమాను మిస్ చేసుకున్న వాళ్లు చాలా వరకు రాంగ్ డిసీజన్స్ తీసుకున్నారు.
Also Read: తెలుగు హీరోలకు దెబ్బేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్…
ఎందుకంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలైతే వచ్చాయి. కానీ కూలీ సినిమాని చూసిన తర్వాత ఈ సినిమాకి వస్తున్న టాక్ ను బట్టి ఈ సినిమాని రిజెక్ట్ చేసిన వాళ్లే చాలా సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లైతే వ్యక్తం అవుతున్నాయి…
ఇక ఈ సినిమాను మొదట కమల్ హాసన్ తో చేయాలని లోకేష్ కనకరాజు అనుకున్నాడు. కానీ కమల్ హాసన్ మాత్రం తనకి ఈ సబ్జెక్టు సెట్ అవ్వదని ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక అలాగే ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఇక నాగార్జున పాత్ర కోసం మొదట బాలీవుడ్ స్టార్ హీరో అయిన జాన్ అబ్రహం ను తీసుకోవాలని అనుకున్నారట.
Also Read: లోకేష్ కనకరాజ్ కి రజినీకాంత్ తో సినిమా చేయడం ఇష్టం లేదా..?
కానీ అప్పుడు ఆయన కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్స్ అయితే ఇవ్వలేకపోయాడు… అలాగే సౌరవ్ శోబిన్ చేసిన పాత్ర కోసం మొదట ఫహద్ ఫాజిల్ ని సంప్రదించారు. కానీ ఆయనకు ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో దానిని రిజెక్ట్ చేసినట్టుగా గతంలో లోకేష్ కనకరాజు తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను మిస్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లకి ఈ సినిమాలో చేసిన పెద్దగా గుర్తింపు అయితే వచ్చేది కాదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు…