Independence Day 2025: 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత భారత దేశం స్వాతంత్య్రం పొందింది. ఇది అంత ఈజీగా రాలేదు. అనేక పోరాటాలు వేల మంది ప్రాణ త్యాగం ఫలితంగా భారత్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి బ్రిటిష్ పాలకులు భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినం జరుపుకుంటున్నాం. ఇక భారత రాజ్యాంగా 1950, జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ రెండు వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారు. భారత జాతీయ పతాకం దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈ రెండు సందర్భంల్లో జెండా ఆవిష్కరణ భిన్నంగా ఉంటుంది.
స్వేచ్ఛా సంకేతం..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15న భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంలో జెండా కింది భాగంలో కట్టి ఉంటుంది, ఆ తర్వాత పైకి ఎగురవేయబడుతుంది. ఈ విధానం బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం సాధించిన విముక్తిని, స్వేచ్ఛను సూచిస్తుంది. జెండా కింద నుంచి పైకి ఎగరడం అనేది దేశం అణచివేత నుంచి స్వాతంత్య్రం వైపు పయనించిన చారిత్రక గమనాన్ని ప్రతిబింబిస్తుంది. స్వాతంత్య్ర పోరాట ఫలితాన్ని గుర్తుచేస్తుంది.
Also Read: సింధూ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే..పాక్ కు శోకాన్ని మిగిల్చిన నరేంద్ర మోడీ
రాజ్యాంగ బద్ధత..
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్రపతి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ రోజు జెండా ముందుగానే పై భాగంలో కట్టి ఉంటుంది, రాష్ట్రపతి తాడును లాగడం ద్వారా దానిని ఆవిష్కరిస్తారు. ఈ విధానం భారతదేశం ఇప్పటికే స్వతంత్ర దేశంగా ఉన్న వాస్తవాన్ని సూచిస్తుంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని ఈ ఆవిష్కరణ గుర్తుచేస్తుంది. రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడం ద్వారా దేశం యొక్క సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకు దేశం అంకితభావాన్ని సూచిస్తుంది.
స్వాతంత్య్ర దినం, గణతంత్ర దినం రెండూ భారత జాతీయ పతాకావిష్కరణ ద్వారా దేశ గౌరవాన్ని, ఐక్యతను చాటిచెబుతాయి. ఈ రెండు రోజులలో జెండా ఆవిష్కరణలోని విభిన్న విధానాలు భారతదేశ చరిత్రలోని రెండు కీలక ఘట్టాలను – స్వాతంత్య్ర సాధన, రాజ్యాంగ అమలు – ప్రతిబింబిస్తాయి. ఈ ఆవిష్కరణలు కేవలం ఆచారాలు మాత్రమే కాక, భారత జనత యొక్క స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై నిబద్ధతను తెలియజేసే సాంస్కృతిక, రాజకీయ సంకేతాలు.