Lokesh Kanagaraj Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతకుముందు చేసిన ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టినప్పటికి విక్రమ్ సినిమాతో ఇటు కమర్షియల్ గా అటు దర్శకుడిగా మంచి సక్సెస్ ను సాధించి టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు…ఇక ఆ తర్వాత విజయ్ తో చేసిన ‘లియో’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయినప్పటికి రజినీకాంత్ పిలిచి మరి తనతో ఒక సినిమా చేయమని లోకేష్ కనకరాజుని అడిగాడు. దాంతో లోకేష్ అప్పటికే ‘ ఎల్ సి యు’ (లోకేష్ కనకరాజ్ యూనివర్స్) లో ఉన్న సినిమాలను చేయాలని అనుకున్నాడు. కానీ రజనీకాంత్ అడగడంతో అప్పటికప్పుడు ఏదో ఒక కథ రాసుకొని రజినీకాంత్ తో కూలీ అనే సినిమా చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ ను సంపాదించుకుంది…
Also Read: ‘కూలీ మూవీ అంత ఒకే కానీ ఈ 2 మైనస్ అయ్యాయా..?
ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలను చేసిన దర్శకుడు ఈ సినిమాను చేశాడా? అంటే ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే నాసిరకం కథతో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేని స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని తెరకెక్కించాడు. నిజానికి లోకేష్ కనకరాజుకి రజినీకాంత్ తో సినిమా చేయడం ఇష్టం లేకపోతే సినిమా చేసే ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చు కదా…
ఎందుకని ఇలాంటి ఒక కథను ఎంచుకొని రజనీకాంత్ తో సినిమా చేసి అతనికి బ్యాడ్ ఇమేజ్ ని కట్టబెట్టాలని చూశాడు అంటూ కొంతమంది రజినీకాంత్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…మరి రాబోయే సినిమాలతో అయిన లోకేష్ కనకరాజు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఆయన ‘ఖైదీ 2’ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: నాగార్జున కోసం మరికొన్ని పాత్రాలను డిజైన్ చేస్తున్న తెలుగు డైరెక్టర్స్…
ఈ సినిమాతో కనక తను పూర్తి ఫామ్ ను సంపాదించుకుంటే మరోసారి టైర్ వన్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే వస్తాయి. లేదంటే మాత్రం లోకేష్ భారీగా వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక మొత్తానికైతే రజనీకాంత్ ని తన అభిమానులు ఊహించిన రేంజ్ లో లోకేష్ కనకరాజు చూపించకపోవడంతో వాళ్ళ తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…