https://oktelugu.com/

Puri Jagannadh Son: పూరి జగన్నాథ్ కొడుకు అసలు పేరు ఎందుకు మార్చుకున్నాడు.? ఆ కథేంటి.?

సినిమా ఇండస్ట్రీ లో వారసుల హవా ఎక్కువై పోయింది. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు కూడా ఇప్పుడు స్టార్ హీరో గా గుర్తింపు పొందటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 04:42 PM IST

    Puri Jagannadh Son

    Follow us on

    Puri Jagannadh Son: తెలుగు సినిమా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ యూత్ లో ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంటాయి. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ భారీ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన కొడుకు ఆయన ఆకాశ్ పూరి కూడా చిరుత, బుజ్జిగాడు సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత ఆయన ‘ఆంధ్ర పోరి’ అనే సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ‘మెహబూబా ‘ అనే సినిమాతో ఫుల్ టైమ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ ఆకాశ్ పూరి మాత్రం ఎక్కడా తడబడకుండా వరుసగా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న ఆకాశ్ పూరి తన పేరుని చేంజ్ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేశాడు.

    Also Read: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు

    ఆకాష్ పూరి గా ఉన్న ఆయన పేరు లో నుంచి పూరి ని తీసేసి ఆకాష్ జగన్నాధ్ గా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన పేరు చేంజ్ చేయడం వెనక కారణమేంటి అంటూ సోషల్ మీడియాలో పలు రకాల కథనాలైతే వెలువడుతున్నాయి. నిజానికి ఆకాశ్ పూరి అనే పేరు ఆయనకు బాగా యాప్ట్ అయింది. కానీ ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఆయనకు సక్సెసులు రాలేదని తన పేరును ఆకాశ్ జగన్నాధ్ గా మార్చుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆకాశ్ జగన్నాధ్ ఒక భారీ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తనదైన రీతిలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ అయితే రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు సక్సెస్ కనక కొట్టకపోతే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా వెనుకబడిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి వాళ్ళ నాన్న డైరెక్షన్ లో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకోవచ్చు.

    కానీ వాళ్ళ నాన్న తో సినిమా చేయకుండా తనే స్వయంగా ఎదగాలనే ఉద్దేశ్యం తో ఉన్నాడు. కాబట్టి ఆకాశ్ వాళ్ల నాన్న అయిన పూరి జగన్నాధ్ తో సినిమా చేయడం లేదు. నిజానికి అయితే ఆకాశ్ జగన్నాధ్ ఇప్పుడు పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేసి మంచి సక్సెస్ ని సాధించి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత వేరే డైరెక్టర్లతో సినిమాలు చేస్తే ఆయనకు మార్కెట్ పరంగా బాగా వర్కౌట్ అవుతుందని మరి కొంతమంది సినీ మేధావులు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి పూరి జగన్నాధ్ తో ఆకాష్ జగన్నాధ్ సినిమా చేస్తాడా లేదా అనేది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమాను రిలీజ్ చేసే హడావుడిలో చాలా బిజీగా ఉన్నాడు…

     

    Also Read: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?