‘అల్లు స్నేహ’ సరికొత్త రికార్డ్.. ఏకంగా 4 మిలియన్స్ !

బన్నీ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారక, ఆయన స‌తీమ‌ణి అల్లు స్నేహ కూడా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. అయితే, ఆ రికార్డ్ బాక్సాఫీస్ వద్ద కాదు, సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద. అవును, స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించి, తెలుగులో ఏ స్టార్ వైఫ్‌ కి సాధ్యం కాని ఫాలోయర్స్‌ ని తాను దక్కించుకున్నారు . అల్లు స్నేహాకు ఇప్పటి వరకు 4 మిలియ‌న్‌ ప్లస్‌ […]

Written By: admin, Updated On : June 17, 2021 6:03 pm
Follow us on

బన్నీ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారక, ఆయన స‌తీమ‌ణి అల్లు స్నేహ కూడా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. అయితే, ఆ రికార్డ్ బాక్సాఫీస్ వద్ద కాదు, సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద. అవును, స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించి, తెలుగులో ఏ స్టార్ వైఫ్‌ కి సాధ్యం కాని ఫాలోయర్స్‌ ని తాను దక్కించుకున్నారు .

అల్లు స్నేహాకు ఇప్పటి వరకు 4 మిలియ‌న్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టా ఫాలోయర్స్‌ లో ఇదొక స‌రికొత్త రికార్డు అనే చెప్పాలి. అసలు ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త సాధించడంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అల్లు స్నేహకు 4 మిలియన్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌ ఉంటే, మెగా కోడలు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనకు 3.3 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్నారు.

అదే విధంగా సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు భార్య మరియు ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ నమ్రత శిరోద్కర్‌ 2 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్నారు. అయితే అల్లు స్నేహకి ఎక్కువ మంది ఫాలోవర్స్ కి ఉండటానికి కారణం, ఆమె రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వడమే. పైగా తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన ఫాలోవర్స్ కి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

దాంతో ఆమె సోషల్ మీడియా ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉన్నారు. ఎలాగూ అల్లు అర్జున్ భార్యగా ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే మిగిలిన అందరి స్టార్ హీరోల భార్యలు కంటే స్నేహకు ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు.