Pradeep Ranganathan turns producer: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథన్. ఇప్పటి వరకు ఆయన నాలుగు సినిమాల్లో హీరో గా నటిస్తే, అందులో మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ మార్కుని అవలీల గా దాటాయి. రీసెంట్ గా విడుదలైన ‘LIK’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. హీరో గా ఇంత సక్సెస్ ని చూసిన ప్రదీప్ రంగనాథన్, డైరెక్టర్ గా కూడా అదే రేంజ్ సక్సెస్ లను చూశాడు. ఆయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యిందే డైరెక్టర్ గా అనే సంగతి మన అందరికీ తెలిసిందే. జయం రవి హీరో గా నటించిన ‘కోమలి’ అనే చిత్రానికి దర్శకుడు ఆయనే.
ఆ తర్వాత తాను హీరో గా నటించిన మొదటి చిత్రం ‘లవ్ టుడే’ కి కూడా తానే దర్శకత్వం వహించాడు. తెలుగు , తమిళ భాషల్లో ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాను హీరో గా నటిస్తున్న తదుపరి చిత్రాన్ని కూడా తన స్వియ దర్శకత్వం లోనే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ప్రదీప్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా నిర్మాత గా మారబోతున్నాడు. తన నిర్మాణ సంస్థ లో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట ప్రదీప్ రంగనాథన్ . ఈ చిత్రం లో హీరోయిన్ గా మమిత బైజు నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతం లో వీళ్లిద్దరు హీరో హీరోయిన్లు గా ‘డ్యూడ్’ అనే చిత్రం లో కలిసి నటించారు.
ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ చిత్రానికి వ్యక్తిగతంగా చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కేవలం ఒక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట , స్క్రీన్ పై కనిపించడట. అంతే కాదు , తనతో ‘డ్రాగన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అస్వత్ మారిముత్తు ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది.
