Kalki Pre Release Event: అమితాబ్ పాదాలను తాకలేకపోయిన ప్రభాస్… కారణం ఏంటి..?

బాలీవుడ్ జనాలు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసే రేంజ్ లో ఈ సినిమా మీద అంచనాలైతే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయి లో జరుపుకోవడం కూడా ఒకరకంగా మంచి విషయం అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : June 20, 2024 7:50 am

Kalki Pre Release Event

Follow us on

Kalki Pre Release Event: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో కల్కి సినిమాలో నటించిన స్టార్ యాక్టర్స్ అందరు పాల్గొనడం విశేషం… ఇక అందులో భాగంగానే ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే లాంటి నటులు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవగా ఈ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. అయితే దీంతో సినిమా ప్రమోషన్స్ అయితే భారీ స్థాయిలో జరిగిందనే చెప్పాలి.

ఇక బాలీవుడ్ జనాలు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసే రేంజ్ లో ఈ సినిమా మీద అంచనాలైతే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయి లో జరుపుకోవడం కూడా ఒకరకంగా మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఈమధ్య నాగ్ అశ్విన్ విపరీతంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం ఈ సినిమాకి తగినంత రీచ్ అయితే రాకపోతే కలెక్షన్స్ పరంగా దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి…

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తను మొదటిసారి అమితాబచ్చన్ గారిని కలిసినప్పుడు తన కాళ్ళని తాకాలని చూసారట. కానీ అమితాబచ్చన్ మాత్రం దాన్ని వారించాడట. ఆయన ఎంత ఆపిన ప్రభాస్ ఆగకపోయేసరికి నువ్వు నా కాళ్ళను తాకితే నేను కూడా నీ కాళ్లను తాకుతా అని అమితాబచ్చన్ అన్నాడట. ఇక దాంతో దెబ్బకి ప్రభాస్ ఆగిపోయాడట. ఇక మొత్తానికైతే అమితాబచ్చన్ పాదాలను తాకే అదృష్టం నాకు రాలేదు అంటూ ప్రభాస్ ఈ ఈవెంట్లో చెప్పడం విశేషం..

ఇక మొత్తానికైతే ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయిన ప్రభాస్ అమితాబచ్చన్ గురించి ఇలా చెప్పడంతో అటు అమితాబ్ అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది ఇక దాని కోసమే ఈ సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతున్నారు…