https://oktelugu.com/

Kalki Pre Release Event: కల్కి లుక్ మీద సంచలన లీక్ బయటపెట్టిన కమల్ హాసన్…

రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న కమలహాసన్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కమలహాసన్ కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు.

Written By: , Updated On : June 20, 2024 / 08:07 AM IST
Kalki Pre Release Event

Kalki Pre Release Event

Follow us on

Kalki Pre Release Event: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా ఈనెల 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నప్పటికీ కమలహాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర కూడా హైలెట్ కాబోతుందనే విషయం అయితే తెలుస్తుంది. ఇక దీనికోసం నాగ్ అశ్విన్ విపరీతమైన రీసెర్చ్ చేశారట. ఆ పాత్ర ఎలా ఉండాలి, దాని నడవడిక ఎలా ఉండాలి, అనే దానిమీద చాలా రోజులపాటు రీసెర్చ్ చేసి ఆ లుక్ ను డిజైన్ చేశారట.

ఇక రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న కమలహాసన్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కమలహాసన్ కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. అయితే ఈ సినిమాలో నేను విలన్ పాత్ర పోషిస్తున్నాను. ఇక ఈ సినిమాలో ఒక ముసలి గెటప్ కావాలి అంటే నేను నాకు తెలిసిన గెటప్ లు అన్నింటిని అనుసరించి సపరేట్ గా ఒక డిజైన్ ను ఏర్పాటు చేసుకొని నాగ్ అశ్విన్ దగ్గరికి వెళ్లాను.

అయితే అదే డిజైన్ తో అమితాబచ్చన్ గెటప్ ఉంటుందని చెప్పాడు అంటూ ఈ విషయాన్ని చెబుతూనే కమలహాసన్ ఇక మరో గెటప్ తో వెళ్తే ఆ గెటప్ ని ఆల్రెడీ ప్రభాస్ వేస్తున్నాడు అని చెప్పాడట. ఇక నువ్వే ఏదైనా గెటప్ సెట్ సజేస్ట్ చేయమని చెప్పగా నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన గెటప్ ని తన కోసం తీసుకొచ్చారని నాగ్ అశ్విన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాడు.

ఇక దాంతో ఈ సినిమా మీద మన స్టార్ హీరోలందరూ కలిసి భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ఫలితం ఏంటి అనేది తెలియబోతుంది…ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…