https://oktelugu.com/

Kalki 2898 AD: కల్కి సినిమాతో హృతిక్ రోషన్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్…ఈ సంవత్సరం కల్కి నే టాప్…

ఈ సంవత్సరం హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఫైటర్ సినిమా బాలీవుడ్ లో 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక కల్కి సినిమా ఒక్క బాలీవుడ్ లోనే 219 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఒక డబ్ చేసిన సినిమా బాలీవుడ్ లో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను సాదించిన సినిమా గా నిలవడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : July 10, 2024 / 02:51 PM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో కూడా యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎదిగి పాన్ ఇండియాలో బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.

    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కల్కి సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో సైతం ఒక భారీ సక్సెస్ ను సాధించాడు.

    ఈ సంవత్సరం హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఫైటర్ సినిమా బాలీవుడ్ లో 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక కల్కి సినిమా ఒక్క బాలీవుడ్ లోనే 219 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఒక డబ్ చేసిన సినిమా బాలీవుడ్ లో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను సాదించిన సినిమా గా నిలవడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక కల్కి సినిమా జోరు చూస్తుంటే మరో రెండు మూడు వందల కోట్ల వరకు కలెక్షన్లను ఈజీగా రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అలాగే మేకర్స్ తొందర్లోనే ఈ సినిమాను ఓటిటి ల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది…