Prabhas and Vijay Deverakonda: ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకి మంచి కథ ఉండాలి. దాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేసే కెపాసిటీ దర్శకుడికి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. నిజానికి స్టార్ హీరో సినిమా అయినా యంగ్ హీరో సినిమా అయిన కంటెంట్ ను బట్టి సినిమా అనేది ఆడుతుంది అంతే తప్ప స్టార్స్ ని బేస్ చేసుకొని సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం అనే చెప్పాలి… స్టార్ హీరోల సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి అంతే తప్ప సక్సెస్ ని డిసైడ్ చేసే కెపాసిటి మాత్రం వాళ్ళకు ఉండదు. కాబట్టి కథ, డైరెక్షన్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రభాస సైతం ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండటం విశేషం…అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మొదట విజయ్ దేవరకొండని అడిగారట.
తను కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ను పక్కన పెట్టి మలయాళం హీరో అయిన దుల్కర్ సల్మాన్ తో ఈ సినిమాలో క్యారెక్టర్ ను చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే విజయ్ దేవరకొండ చేయాల్సిన క్యారెక్టర్ అది కాదట.
ఎందుకంటే విజయ్ దేవరకొండ వరుస ప్లాపుల్లో ఉండటంతో ఆయన మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఆయన్ని తప్పించి తన ప్లేస్ లో దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు.
ఫౌజీ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండటం విశేషం…ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమా పాన్ ఇండియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ ను సంపాదిస్తోంది. ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోందనేది తెలియాల్సి ఉంది…