https://oktelugu.com/

Astrology: సొంత రాశిలో శని సంచారం.. ఈ మూడు రాశుల వారికి ధన ప్రవాహం..

శని సొంత రాశిలో సంచరించడం వల్ల మిథునం రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశివారికి అనుకోని అదృష్టం వరించనుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 27, 2024 / 08:31 AM IST

    Astrology

    Follow us on

    Astrology: శని ప్రభావం ఉండడం వల్ల జీవితం అల్లకల్లోలం అవుతుందని అంటారు. కానీ కొన్ని రాశుల్లో శని సంచారం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడి వారి జీవితాలు సంతోషంగా మారుతాయి. ప్రస్తుతం శని తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో మూడు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. దీంతో వారు ఏ పని చేసినా విజయమే అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి సమయం మళ్లీ 30 సంవత్సరాల తరువాతే ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. శని సంచారం వల్ల ఏయే రాశులపై ప్రభావం ఉంటుందో చూద్దాం.

    శని సొంత రాశిలో సంచరించడం వల్ల మిథునం రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశివారికి అనుకోని అదృష్టం వరించనుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకోని ఆదాయం వస్తుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడుతాయి.

    శని ప్రభావం మకర రాశిపైనా ఉంటుంది. దీంతో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పెండింగు పనులు పూర్తవుతాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పెండింగు సమస్యలు పరిష్కారం అవుతుంది.

    కుంభ రాశిపై శని సంచార ప్రభావం ఉంటుంది. ఈ రాశివారికి ఇప్పటి నుంచి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టపడి పని చేయడం వల్ల సరైన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.