Raayan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు ఒక అరడజన్ మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నరు. ఇక ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోలు కూడా టాప్ హీరోలుగా కొనసాగడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే ఎంతైతే కలెక్షన్స్ ను వసూలు చేస్తున్నాయో, ఆ మొత్తం కలెక్షన్ల లో ఈ ముగ్గురి హీరోల సినిమాలే దాదాపు సగం కలెక్షన్లు వసూలు చేస్తూ ఉంటాయి. ఇక అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరోల నుంచి ఏ ఒక్క సినిమా వస్తుందన్నా కూడా ప్రేక్షకులు చాలా అటెన్షన్ తో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మరొక సినిమా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి వెళ్ళబోతుంది. ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు ఏరికోరి మరి ఈ సినిమా కోసం ఏ ఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం మెగా అభిమానుల్లో తీవ్రమైన కలవరాన్ని రేపుతుంది…
దానికి కారణం ఏంటి అంటే ధనుష్ హీరోగా వచ్చిన ‘రాయన్ ‘ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక దానికి తోడు ఈ సినిమాలో పాటలు అసలేం బాగాలేవు. ఇక బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక దీని ఇంపాక్ట్ రామ్ చరణ్ సినిమా మీద కూడా పడబోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ లాంటి ఒక హీరోకి రెహమాన్ మంచి మ్యూజిక్ ని ఇస్తే సినిమా మ్యూజికల్ హిట్ అవుతుంది.
కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో వైవిధ్యం అయితే అంత పెద్దగా కనిపించడం లేదు. దానివల్ల మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ కి ఏదైనా ఇబ్బంది కలగొచ్చు అనే విధంగా మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్, తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో ఎక్కువ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఆయా సినిమాలకు వాళ్ళ మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యే అవుతుంది. తద్వారా భారీ సక్సెస్ లను కొడుతున్నారు.
మరి ఏఆర్ రెహమాన్ మాత్రం పెద్దగా అంచనాలను అందుకోలేకపోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయనను రామ్ చరణ్ సినిమా కోసం తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ పలువురు వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…ఇక కొందరైతే ఈ విషయం లో బుచ్చిబాబు ను తెగ తిట్టేస్తున్నారు…చూడాలి మరి రెహమాన్ రామ్ చరణ్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ను ఇస్తాడు అనేది…