https://oktelugu.com/

Gaami: విశ్వక్ సేన్ గామి కి ఓటీటీలో ఊహించని రెస్పాన్స్!

విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన గామి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ పొందుతుంది. జీ 5లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. గామి కేవలం 72 గంటల్లో 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవడం విశేషం.

Written By:
  • S Reddy
  • , Updated On : April 17, 2024 / 11:58 AM IST

    Gaami

    Follow us on

    Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి. సమ్మర్ కానుకగా మార్చి 8న విడుదలైన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. గామి ఓటిటీ రైట్స్ జీ 5 కొనుగోలు చేసింది. కాగా గామి చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ మూవీ దుమ్మురేపుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. విద్యాసాగర్ కౌగిత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

    విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన గామి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ పొందుతుంది. జీ 5లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. గామి కేవలం 72 గంటల్లో 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవడం విశేషం. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గామి చిత్ర కథ విషయానికి వస్తే.. హరిద్వార్ లో ఉండే అఘోరా శంకర్ వింత సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఈ కారణంగా అతడు బాహ్య ప్రపంచంలోకి రాడు.

    అయితే కొన్నాళ్ళకు అజ్ఞాతం వీడి తన సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. తన వ్యాధికి పరిష్కారం హిమాలయాల్లో ఉందని తెలుసుకుంటాడు. అక్కడ 36 ఏళ్లకు ఒకసారి పూచే పూల కోసం సహస యాత్ర ప్రారంభిస్తాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి.

    ఓ పల్లెటూరిలో ఉండే దేవదాసి ఉమా, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటాడు. అసలు వాళ్లకు శంకర్ కు ఉన్న సంబంధమేంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా లేదా? అనే విషయాలు దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. గామి క్లైమాక్స్, చివర్లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మరోసారి చూసి ఆనందించవచ్చు.