New OTT releases this week: సినిమా ప్రియులకు పండగే పండగ… ఓటీటీలో ఒక్కరోజే ఎన్ని సినిమాలో!

మరో సంక్రాంతి మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించాడు. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేసిన కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

Written By: S Reddy, Updated On : February 9, 2024 2:14 pm
Follow us on

New OTT releases this week: ఈ వారం సినిమా ప్రియులకు ప్రత్యేకం. స్టార్ హీరోల చిత్రాలతో పాటు కొన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో ప్రత్యక్షం అయ్యాయి. వాటిలో సంక్రాంతి కూడా చిత్రాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 అర్థరాత్రి నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు ఏమిటో చూద్దాం… సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ లో గుంటూరు కారం మూవీ చూడవచ్చు. గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

మరో సంక్రాంతి మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించాడు. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేసిన కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం బబుల్ గమ్. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా రూపొందించారు. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు.

బబుల్ గమ్ చిత్రం తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం విన్ లో అందుబాటులోకి వచ్చింది. మార్వెల్ హీరోస్ యూనివర్స్ నుండి వచ్చిన కొత్త చిత్రం ది మార్వెల్స్. హాట్ స్టార్ లో ఈ హాలీవుడ్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు పలు భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. మరో హాలీవుడ్ మూవీ ది నన్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

కోలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ మూవీ అయలాన్. ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకుడు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. అయలాన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కాగా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయలాన్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే హాలీవుడ్ చిత్రం ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది.