Paul Doraswamy: తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది మహానుభావులు తమ సేవలను పరిపూర్ణంగా అందించారు. వారిలో రచయితల్లో పింగళి నాగేంద్రరావు, ఆర్టిస్టుల్లో పాల్‌దొరస్వామి ప్రముఖులు. వీరిద్దరూ జీవితాంతం బ్రహ్మచారులుగా వుండి తెలుగు తెరకు విశిష్టమైన సేవలందించారు. ‘వందేమాతరం, సుమంగళి చిత్రాలలో కథానాయకుని తండ్రిగా నటించి మెప్పించారు పాల్ దొరస్వామి. టాకీల తొలి దశకంలోనే సినీరంగ ప్రవేశం చేశారు దొరస్వామి. అలాగే ‘మల్లీశ్వరి’ చిత్రంలో మల్లీశ్వరి తండ్రిగా అయన నటన అద్భుతం.
ఇక “పెళ్ళిచేసి చూడు” చిత్రంలో అది దుష్టుడైన గోవిందయ్య పాత్రలో కూడా ఆయన నటన చాలా బాగుంటుంది. హీరో పెళ్ళి చెడగొట్టటానికి ప్రయత్నించి చివరకు ధూపాటి వియ్యన్న చేతిలో అవమానం అయ్యే సీన్స్ లో అయితే, ఆయన నటన అద్భుతంగా అనిపిస్తోంది. వేషాల కోసం తిరిగిన రోజుల నుంచి.. తన కోసమే పుట్టిన పాత్రల వరకు ప్రతి పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసిన సహజ నటుడు దొరస్వామి. “మిన్సమ్మ’ చిత్రంలో నాయిక మేరీ పెంపుడు తండ్రిగా చాలా గంభీరంగా అమాయకంగా నటించి రక్తి కట్టించారు.
Also Read: పవన్ కళ్యాణ్ తో చేయడం అదృష్టంగా భావిస్తోందట !
కానీ ఆయన గురించి నేటి తరానికి ఏ మాత్రం తెలియదు. పాల్‌దొరస్వామికి సినిమా అంటే ప్రాణం. మీకు తెలుసా ? ఆయన సినిమా కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. కేవలం, సినిమాల్లో నటించడానికే తాను బతికి ఉన్నాను అంటూ ఆయన చెబుతూ ఉండేవారట. ఎంత గొప్ప నటుడు ? మనకు మహానటుల గురించి తెలుసు. కానీ నటన కోసం జీవితాన్నే త్యాగం చేసిన నిజమైన సినిమా ప్రేమికుడు పాల్‌దొరస్వామి గురించి ఈ తరానికి కూడా తెలియాలి.
Also Read: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?